The Desk … Eluru : ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం➖ ఎమ్మెల్యే చంటి

The Desk … Eluru : ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం➖ ఎమ్మెల్యే చంటి

🟡 ఏలూరు జిల్లా : ఏలూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం : ది డెస్క్ :

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు

అక్టోబర్‌ 2 నాటికి అర్హులకు పెన్షన్లు

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని జిల్లా టీడీపీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. పవర్‌పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్‌లో ప్రజల నుంచి వినతులు స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా పలువురు సామాజిక భద్రతా పెన్షన్లు మంజూరు చేయాలని కోరగా, అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్‌ అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. అక్టోబర్‌ 2 నాటికి అర్హులందరికీ సామాజిక భద్రతా పెన్షన్లు మంజూరు చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందన్నారు. అభివృద్ధితో పాటు సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ పారదర్శక పాలన అందిస్తున్నామని తెలిపారు.