The Desk… Eluru : అనుమతి లేకుండా ప్యానెల్ బోర్డు నొక్కిన వైసిపి నేతలు

The Desk… Eluru : అనుమతి లేకుండా ప్యానెల్ బోర్డు నొక్కిన వైసిపి నేతలు

🟡 ఏలూరు జిల్లా : ఏలూరు రూరల్ :

శనివారం అర్ధరాత్రి ట్రాన్స్ఫార్మర్ యార్డులోనికి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తులు

పంపులు చెరువులో పాడైపోయిన మోటార్లు

లక్షల్లో నష్టం వాటిల్లిందని అధికారులు వెల్లడి

అనుమతి లేకుండా లోనికి ప్రవేశించడం వల్లే తీవ్ర నష్టానికి ప్రధాన కారణమంటున్న అధికారులు

ది.24 సాయంత్రం శుక్రవారం
రోజున ఎస్ ఎస్ ట్యాంక్ ను సందర్శించిన వైసీపీ నేతలు

పిమ్మట పంపు హౌస్ లోకి ప్రవేశించిన వైసిపి నేతలు మోటార్లకు సంబంధించి ఏ బటన్ ప్రెస్ చేయాలో ఏది చేయకూడదో తెలియక ప్యానెల్ బోర్డు బట్టన్ నొక్కేసరికి 150 HB మోటార్ అకస్మాత్తుగా పాడైపోయిన వైనం.

ఈ మోటార్ కి సంబంధించి టెక్నికల్ ఇంజనీర్స్ ని పిలిపించి రిపేర్ నిమిత్తం పంపించిన అధికారులు..

పాడైన మోటారు 20 రోజుల్లో అందుబాటులోకి వస్తుందంటున్న అధికారులు

వైసిపి నేతలు అనుమతి లేకుండా ప్యానెల్ బోర్డు ఆపరేట్ చేయడం వల్లే ఇంత నష్టం వాటిల్లిందని అధికారులు వెల్లడి.

శనివారం అర్ధరాత్రి ట్రాన్స్ఫార్మర్ యార్డ్ లోనికి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి అనుమతి లేకుండా పవర్ సప్లై ని డిస్టర్బ్ చేయడంవల్ల రెండు ట్రాన్స్ఫార్మర్లు, జనరేటర్ దెబ్బతిన్నాయని, ఇవి పోవడం వల్ల దాదాపు పది మోటర్లు పనిచేయడం లేదని.. వీటిని సంబంధించిన టెక్నికల్ ఇంజనీర్లు 15, 20 రోజుల్లోపు సరి చేస్తారని.. వీటి మరమ్మత్తుల నిమిత్తం దాదాపు లక్షలు రూపాయలు ఖర్చు అవుతుందని తెలిపిన అధికారులు..

స్థానిక ఎమ్మెల్యే, మేయర్ సూచనల మేరకు.. నగరంలో ఒక పూట వాటర్ ని సప్లై చేస్తున్నామని, ఆ సమయంలో మోటార్లన్నీ పనిచేసేవని..

ఈ రెండు రోజుల్లో జరిగిన దుశ్చర్య వల్ల మోటార్లు దాదాపుగా దెబ్బతిన్నాయని, అయినను ఈరోజు స్టాఫ్ అంతా కలిసి పాడైపోయిన మోటార్లను యుద్ధ ప్రాతిపదికన సరిచేయిస్తున్నామని.. నగర ప్రజలకు నీటి సప్లై విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదని అధికారులు తెలిపారు.