The Desk … Eluru : సీఎంఆర్‌ఎఫ్‌తో పేదలకు వైద్య భరోసా

The Desk … Eluru : సీఎంఆర్‌ఎఫ్‌తో పేదలకు వైద్య భరోసా

🟡 ఏలూరు జిల్లా : ఏలూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం : ది డెస్క్ :

14 మందికి రూ.19.38 లక్షల ఆర్థిక సాయం

చెక్కులు, ఎల్‌వోసీలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బడేటి చంటి

వైద్య చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌) ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోందని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. ఏలూరు పవర్‌పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన 14 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.19,38,523 విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు, ఎల్‌వోసీ కాపీలను పంపిణీ చేశారు.

పంపిణీ చేసిన మొత్తంలో రూ.9,16,422 విలువైన తొమ్మిది సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు, రూ.10,22,101 విలువైన ఐదు ఎల్‌వోసీ కాపీలు ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను ఆప్యాయంగా పలకరించిన ఎమ్మెల్యే, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు.

అనంతరం ఎంఎల్ఏ చంటి మాట్లాడుతూ :

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో నిరుపేదలకు ఖరీదైన వైద్య సేవలు కూడా అందుబాటులోకి వస్తున్నాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఏలూరు నియోజకవర్గంలో 716 మంది బాధితులకు రూ.6,35,56,039 విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ సాయాన్ని అందజేసినట్లు వెల్లడించారు. అర్హులైన ప్రతి బాధితుడికి ప్రభుత్వ సహాయం అందేలా నిరంతరం చర్యలు కొనసాగిస్తామని ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు.

CMRF Extends Medical Support to the Poor

14 Beneficiaries Receive Financial Assistance Worth ₹19.38 Lakh

MLA Badeti Chanti Distributes Cheques and LOC Copies

The government is standing by economically disadvantaged patients through the Chief Minister’s Relief Fund (CMRF), said Eluru MLA and District Telugu Desam Party President Badeti Chanti. Speaking at a programme held on Thursday at the MLA Camp Office in Powerpet, Eluru, he distributed CMRF cheques and Letters of Credit (LOC) copies worth a total of ₹19,38,523 to 14 beneficiaries from the constituency.

The assistance included nine CMRF cheques worth ₹9,16,422 and five LOC copies worth ₹10,22,101. On the occasion, the MLA interacted with the beneficiaries, enquired about their health conditions, and offered them words of encouragement.

Speaking on the occasion, MLA Badeti Chanti said :

Under the leadership of Chief Minister ****, even expensive medical treatment is becoming accessible to poor and needy families through the CMRF scheme. He stated that, so far, 716 beneficiaries in the Eluru Assembly constituency have received financial assistance amounting to ₹6,35,56,039 under the Chief Minister’s Relief Fund.

The MLA reaffirmed that every eligible patient would continue to receive government support and assured that efforts would be made to ensure timely assistance reaches all deserving beneficiaries.