🟡 ఏలూరు జిల్లా: ఏలూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం :ది డెస్క్
ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని జిల్లా టీడీపీ అధ్యక్షులు, ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ వినతులను సమర్పించారు.
ఇళ్ల మంజూరు, పెన్షన్లు, పారిశుద్ధ్యం, మౌలిక వసతులు తదితర అంశాలపై ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి సమస్యలను తీసుకురాగా, వాటిని క్షుణ్ణంగా విన్న బడేటి చంటి సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలకు అండగా ఉంటానని, ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా టీడీపీ ఏలూరు నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం మాట్లాడుతూ :
ప్రజల మధ్య నిరంతరం ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే చంటి ప్రత్యేక చొరవ చూపుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా డ్రైన్ల పూడికతీత పనులు, ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాల అమలుపై ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి రానున్న రోజుల్లో మరిన్ని చర్యలు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.

Flood of Petitions at Praja Darbar
MLA Chanti Directs Officials for Immediate Resolution of Public Grievances
Eluru Assembly Constituency MLA and District TDP President Badeti Chanti stated that resolving the problems of the people of the constituency remains his foremost priority. During the Praja Darbar program held on Friday at the MLA Camp Office in Eluru, a large number of residents from various parts of the constituency attended and submitted their grievances.
People brought several issues to the MLA’s attention, including housing allotments, pensions, sanitation, and basic infrastructure. After carefully hearing each representation, Badeti Chanti instructed the concerned officials to take immediate action and ensure prompt resolution of the grievances. He assured the public that he would continue to stand by them and make every effort to address their problems effectively.
Speaking on the occasion, Eluru Town TDP President Chode Venkataratnam said :
MLA Chanti has been maintaining constant contact with the people and taking special initiative to resolve their issues. He noted that the MLA has been giving particular attention to desilting drainage canals and implementing special sanitation drives across the constituency. He further stated that several more measures would be undertaken in the coming days to address public concerns and improve civic amenities.

