ఏలూరు జిల్లా : ఏలూరు/ కైకలూరు : ది డెస్క్ :
20 వేల ఎకరాల భూములపై అనుకూల నిర్ణయం వస్తుంది ➖ఎంపీ పుట్టా మహేష్
కైకలూరు, జూన్ 9 (ది డెస్క్): కొల్లేరు ప్రాంత రైతుల సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ (CEC)తో నిరంతరం చర్చలు కొనసాగుతున్నాయని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ తెలిపారు. కొల్లేరులో రైతు సంఘాలు, రాజకీయ పార్టీలతో జరిగిన సమావేశంలో వీడియో కాల్ ద్వారా పాల్గొన్న ఆయన రైతులను ఉద్దేశించి మాట్లాడారు.
సమావేశానికి అధ్యక్షత వహించిన కామినేని శ్రీనివాస్ వీడియో కాల్ ద్వారా ఎంపీతో రైతులను మాట్లాడించారు.
సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ :
కొల్లేరు రైతుల ప్రయోజనాల కోసం ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావుతో కలిసి కేంద్ర స్థాయిలో అనేక ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. సీఈసీ ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా కూడా సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించిన కొన్ని మార్పులను సీఈసీ పరిగణనలోకి తీసుకున్నట్లు వెల్లడించిన ఎంపీ, త్వరలోనే రైతులకు అనుకూలమైన నిర్ణయం వెలువడుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కొల్లేరు సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని, సుమారు 20 వేల ఎకరాల భూములకు సంబంధించిన అంశంలో రైతులకు మేలు జరిగే నిర్ణయం వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

