The Desk … Bhimavaram : 75 రోజుల్లో రూ.61 లక్షలకుపైగా హుండీ ఆదాయం

The Desk … Bhimavaram : 75 రోజుల్లో రూ.61 లక్షలకుపైగా హుండీ ఆదాయం

🔴 పగో జిల్లా :భీమవరం : ది డెస్క్ :

మావుళ్లమ్మ అమ్మవారికి భక్తుల కానుకల వెల్లువ

180 మంది సేవకుల సమక్షంలో హుండీ లెక్కింపు

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ప్రసిద్ధ మావుళ్లమ్మవారి దేవస్థానానికి భక్తులు సమర్పించిన హుండీ కానుకలు మరోసారి విశేష భక్తిశ్రద్ధను చాటాయి. దేవస్థానంలో గత 75 రోజుల కాలానికి సంబంధించిన హుండీలను మంగళవారం దేవదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో తెరచి లెక్కించగా.. మొత్తం రూ.61,06,458 నగదు ఆదాయం లభించింది.
దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి బుద్ధ మహాలక్ష్మి నగేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన హుండీ లెక్కింపు కార్యక్రమం ఉదయం ప్రారంభమై పద్ధతిగా సాగింది. ఈ సందర్భంగా భక్తులు సమర్పించిన కానుకల్లో 76 గ్రాముల 700 మిల్లీగ్రాముల బంగారం, 315 గ్రాముల వెండి కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

ఈ లెక్కింపు కార్యక్రమాన్ని కాకినాడ పట్టణం ఎంఎస్‌ఎన్ చారిటీస్ అసిస్టెంట్ కమిషనర్ చాగంటి సురేష్ నాయుడు పర్యవేక్షించారు.

దేవదాయ ధర్మదాయ శాఖ భీమవరం తనిఖీదారు సాయికుమారి, కరూర్ వైశ్య బ్యాంకు సిబ్బంది, పోలీసు సిబ్బంది, ఆలయ ఉద్యోగులు పాల్గొని లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాల వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 180 మంది సేవకులు ఈ కార్యక్రమంలో పాల్గొని సేవలందించారు.

ఈ సందర్భంగా దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ మాట్లాడుతూ :

మావుళ్లమ్మ అమ్మవారిపై భక్తులకు ఉన్న అపార విశ్వాసానికి హుండీ ఆదాయం నిదర్శనమని పేర్కొన్నారు. భక్తులు సమర్పిస్తున్న కానుకలను దేవస్థానం అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు వినియోగిస్తామని తెలిపారు.

భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతుండటంతో ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు కూడా వేగవంతంగా కొనసాగుతున్నాయని, అమ్మవారి ఆశీస్సులతో దేవస్థానం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని అధికారులు వెల్లడించారు.

Hundi Collections Exceed ₹61 Lakh in 75 Days

Devotees Shower Offerings on Sri Mavullamma Temple

Hundi Counting Conducted in the Presence of 180 Volunteers
The renowned Sri Mavullamma Ammavari Temple in Bhimavaram, West Godavari District, once again witnessed an overwhelming expression of devotion through the offerings made by devotees. During the counting of hundi collections accumulated over the past 75 days, conducted on Tuesday under the supervision of Endowments Department officials, the temple recorded a total cash collection of ₹61,06,458.

The hundi counting process was carried out in an organized and transparent manner under the leadership of Assistant Commissioner and Executive Officer Buddha Mahalakshmi Nagesh. Officials stated that, in addition to the cash offerings, devotees also contributed 76.700 grams of gold and 315 grams of silver.

The counting process was supervised by Chaganti Suresh Naidu, Assistant Commissioner of MSN Charities, Kakinada.
Officials from the Endowments Department, including Bhimavaram Inspector Sai Kumari, staff of Karur Vysya Bank, police personnel, and temple employees participated in the counting process to ensure complete transparency. Around 180 volunteers from various regions of both Telugu-speaking states also took part and rendered their services during the exercise.
Assistant Commissioner

Buddha Mahalakshmi Nagesh stated :

“The hundi collections reflect the immense faith and devotion that devotees have towards Sri Mavullamma Ammavaru. The offerings made by devotees will be utilized for the development of the temple and for providing improved facilities to pilgrims.”

She further noted that with the number of devotees visiting the temple increasing steadily, developmental activities are also being accelerated. Temple authorities expressed confidence that, with the blessings of the Goddess, the temple will continue to progress and achieve greater development in the coming years.