🟡 ఏలూరు జిల్లా : ఏలూరు ఎంపీ కార్యాలయం : ది డెస్క్ :
అనేక సమస్యలతో వినతి పత్రాలతో ప్రజలు ఆయన వద్ద బారులు తీరటం రెండేళ్లుగా చూస్తూనే ఉన్నాం. తన దృష్టికి వచ్చిన సమస్యను పరిష్కరించేవరకూ పట్టుదలతో ఆయన పనిచేసే తీరే ప్రజలను ఆయన వద్దకు క్యూ కట్టేట్లు చేస్తోందని అనటంలో అతిశయోక్తి లేదు. తాజాగా 40 రోజుల విరామం తర్వాత ఏలూరు వచ్చిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ నివాసం వద్ద, వివిధ సమస్యలను విన్నవించుకోవడానికి వచ్చిన ప్రజలు, కార్యకర్తలతో ఉదయం నుంచి సాయంత్రం వరకూ తీరిక లేని వాతావరణం నెలకొంది.
మా ఇళ్లను కాపాడండి :
చేబ్రోలు – నారాయణపురం రైల్వే గేటు (LC-365) వద్ద నిర్మించబోయే ఆర్వోబీ వల్ల ఇళ్లు కోల్పోతున్న బాధిత కుటుంబాల ప్రజలు మంగళవారం ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ను ఆయన నివాసంలో కలిశారు.
ఈ సందర్భంగా వారి సమస్యను సావధానంగా విన్న ఎంపీ, వారి ఇళ్లకు నష్టం లేకుండా బ్రిడ్జి నిర్మాణం చేపడతామని హమీ ఇచ్చారు. ప్రజలకు నష్టం జరిగే ఏ పనీ తాను గానీ, తమ ప్రభుత్వంగానీ చేయబోదని ఎంపీ ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలకు స్పష్టం చేశారు. ఎంపీ స్పందన పట్ల చేబ్రోలు, నారాయణపురం గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

