కుల, మత వివక్ష లేని సమాజం కోసం అంబేద్కర్ కృషి
🟡 ఏలూరు జిల్లా : ఏలూరు ఎంపీ కార్యాలయం : ది డెస్క్ :
భారతరత్న డా. బాబా సాహెబ్ అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ క్యాంపు కార్యాలయంలో ఘనంగా నివాళి అర్పించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి, అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. కుల, మత, సామాజిక వివక్ష లేని సమాజం కోసం అంబేద్కర్ పాటుపడ్డారని ఆల్ ఇండియా అంబేడ్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మొండెం సంతోష్ పేర్కొన్నారు. దళితులు సహా దేశ ప్రజలు ఈరోజు అనుభవిస్తున్న స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామ్యం వెనుక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన కృషి, ఆయన రాసిన పటిష్ట రాజ్యాంగమే కారణమని పలువురు వక్తలు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, ఎమ్మార్పీఎస్ నేత కందుల రమేష్, లంకలపల్లి మాణిక్యాలరావు, సురేష్ , పలువురు స్థానిక నేతలు, ఎంపీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

