🔴 పగో: భీమవరం : ది డెస్క్:
వరలక్ష్మి వ్రతానికి గాజుల కానుక
రూ.1.60 లక్షల విలువైన లక్ష గాజుల సమర్పణ
వరలక్ష్మి వ్రతం సందర్భంగా.. భీమవరంలోని మావుళ్లమ్మవారికి గాజుల అలంకరణ కోసం నారాయణపురానికి చెందిన కట్రెడ్డి వెంకట సుబ్బారావు కుటుంబం లక్ష గాజులను సమర్పించింది. వీరాన్స్ పేరుతో రూ.1.60 లక్షల విలువైన సాధ గాజులు 50 వేలు, కటింగ్ గాజులు 45 వేలు, చిట్టి గాజులు 5 వేల చొప్పున అందజేశారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్, ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ, ధర్మకర్త రామాయణం శ్రీనివాస్ పాల్గొన్నారు. అమ్మవారి అలంకరణకు భక్తులు సమర్పించదలచిన గాజులను ఈ నెల 20లోగా దేవస్థానం కౌంటర్లో అందజేయాలని అసిస్టెంట్ కమిషనర్ తెలిపారు.

