🔴 పశ్చిమ గోదావరి జిల్లా : భీమవరం : ది డెస్క్:
అమ్మవారి సేవకు దంపతుల చేయూత
భీమవరం పట్టణంలోని మావుళ్లమ్మ ఆలయానికి పాలకొల్లు–యలమంచిలి లంక గ్రామానికి చెందిన టి.ఎస్. శ్రీనివాసరావు–పద్మ దంపతులు రూ.55,021 విరాళంగా అందజేశారు.
ఆలయ అభివృద్ధి, అమ్మవారి సేవా కార్యక్రమాలకు తమ వంతు సహకారంగా ఈ విరాళాన్ని అందించినట్లు దాతలు తెలిపారు. విరాళాన్ని ఆలయ నిర్వాహకులకు అందజేయగా…ఆలయ అర్చకులు దంపతులకు ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆశీర్వచనాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం దంపతులకు శేషవస్త్రం అందజేశారు. ఆలయ ధర్మకర్తలు కారెంపూడి ఆదిలక్ష్మి, పాపోలు ఏడుకొండలు తదితరులు వారికి అమ్మవారి ప్రసాదం, జ్ఞాపిక అందజేశారు. ఆలయానికి భక్తులు అందిస్తున్న సహకారం అభినందనీయమని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు.

