🟡 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :
డోర్ టు డోర్ – 36వ డివిజన్..!!
అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు
డ్వాక్రా అవకతవకలపై ఉక్కుపాదం
36వ డివిజన్‌కు మూడు రోడ్లు మంజూరు
తప్పు చేస్తే క్షమించవచ్చని, అయితే మోసాన్ని మాత్రం సహించేది లేదని జిల్లా టీడీపీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. తప్పును ఉపేక్షిస్తే అది సమాజానికి ప్రమాదకరంగా మారుతుందని అన్నారు. టీడీపీ చేపట్టిన ‘రెండేళ్ల నమ్మకం–అభివృద్ధి, సంక్షేమం’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఏలూరులోని 36వ డివిజన్ చేపలతూము సెంటర్‌లో నిర్వహించిన డోర్ టు డోర్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
డివిజన్ ఇన్‌చార్జి చల్లా విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల వివరాలతో కూడిన కరపత్రాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. 36వ డివిజన్‌లో మూడు రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
డ్వాక్రా సంఘాల్లో అవకతవకలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని బడేటి చంటి హెచ్చరించారు. పార్టీని బలహీనపరిచే చర్యలను కూడా సహించబోమన్నారు. ప్రజలకు మేలు చేయడమే తన లక్ష్యమని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పార్టీ మీడియా కోఆర్డినేటర్ చల్లా వెంకట సత్య వరప్రసాదరావు, నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

