🟡 నెల్లూరు జిల్లా : ఆత్మకూరు : ది డెస్క్ న్యూస్ :
135 పంచాయతీల్లో 52 ఏకగ్రీవం
గ్రామాల్లో కూటమి హవా
విజయంతో బాధ్యత పెరిగింది
పదవులు ప్రజాసేవకు అవకాశాలు
నూతన సర్పంచులకు మంత్రి ఆనం అభినందనలు
ఆత్మకూరు నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ, ఎన్డీఏ కూటమి మద్దతుతో 52 మంది సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల పరిధిలో మొత్తం 135 పంచాయతీలకు గాను ఈ ఏకగ్రీవాలు నమోదయ్యాయి. ఈ సందర్భంగా నెల్లూరులోని తన క్యాంపు కార్యాలయంలో నూతన సర్పంచులు, వార్డు సభ్యులను మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అభినందించారు. మండలాల వారీగా ఆత్మకూరులో 9, చేజర్లలో 16, ఏఎస్‌పేటలో 7, సంగంలో 6, అనంతసాగరంలో 6, మర్రిపాడులో 8 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.
ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ :
ఎన్నికల్లో ప్రజలు కల్పించిన అవకాశాన్ని బాధ్యతగా స్వీకరించాలని మంత్రి సూచించారు. పదవులను అధికారంగా కాకుండా ప్రజాసేవకు అవకాశాలుగా భావించి, గ్రామాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, విద్య, వైద్య రంగాల అభివృద్ధికి కృషి చేయాలని, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను అర్హులైన ప్రతి కుటుంబానికి చేరవేయాలని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామాల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని నూతన ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు.

