🔴 ఎన్టీఆర్ జిల్లా : కంచికచర్ల : ది డెస్క్ న్యూస్ :
మద్యం పంపిణీకి పాల్పడితే కఠిన చర్యలు
ప్రశాంత ఎన్నికలకు ప్రజలు సహకరించాలి
అక్రమ మద్యం నిల్వలపై నిఘా
➖ఆశ్రపూన్నీసా బేగం
(ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్, కంచికచర్ల)
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అక్రమ మద్యం నిల్వలు, పంపిణీపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు కంచికచర్ల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆశ్రపూన్నీసా బేగం హెచ్చరించారు. కంచికచర్లలో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆశ్రపూన్నీసా బేగం మాట్లాడుతూ :
ఎవరైనా తమ ఇళ్లలో అక్రమంగా మద్యం నిల్వ చేసినా, ఎన్నికల సమయంలో పంపిణీకి పాల్పడినా కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. అక్రమ మద్యం కార్యకలాపాలపై సమాచారం తెలిస్తే వెంటనే ఎక్సైజ్ శాఖకు తెలియజేయాలని రాజకీయ నాయకులు, ప్రజలను కోరారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

