🔴 పగో జిల్లా : తాడేపల్లిగూడెం : ది డెస్క్ న్యూస్ :
ఎంసీసీ ఉల్లంఘిస్తే కేసులు నమోదు
➖ యేసుబాబు
(తాడేపల్లిగూడెం స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్)
మున్సిపల్ చైర్పర్సన్, వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించి నేడు సాయంత్రం 5 గంటలతో ప్రచారం ముగుస్తుందని తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ యేసుబాబు తెలిపారు.
పోటీలో ఉన్న అభ్యర్థులందరూ ఈ విషయాన్ని గమనించి 5 గంటలలోపు ప్రచారాన్ని నిలిపివేయాలని ఆయన కోరారు. గడువు ముగిసిన తర్వాత ప్రచారం నిర్వహిస్తే ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) ఉల్లంఘన కింద కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
ముఖ్య అంశాలు :
రేపు పోలింగ్ – ఏర్పాట్లు పూర్తి :
ఈ నెల 26వ తేదీ ఉదయం నుంచి జరగనున్న ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కమిషనర్ వెల్లడించారు.
నన్నయ్య వర్సిటీలో కేంద్రాలు :.
ఎన్నికల సామగ్రి రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్‌తో పాటు పోలింగ్ అనంతరం జరిగే కౌంటింగ్ ప్రక్రియను ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో ఏర్పాటు చేసినట్లు ప్రజలు, అభ్యర్థులు గమనించాలని సూచించారు.
30న కౌంటింగ్:
ఓట్ల లెక్కింపు ఈ నెల 30వ తేదీన నిర్వహిస్తామని తెలిపారు.
ఏజెంట్లు, పాసుల కోసం అధికారులను సంప్రదించాలి :
అన్ని పార్టీల అభ్యర్థులు నేడు సాయంత్రం 5 గంటలకు ప్రచారం ఆపి, తదుపరి ప్రక్రియల కోసం తమ నామినేషన్లు స్వీకరించిన ఎన్నికల అధికారులను సంప్రదించాలని సూచించారు. అధికారులు ఇచ్చే దరఖాస్తు ఫారాలను పూర్తి చేసి ఇస్తే, పోలింగ్ ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లకు పాసులు జారీ చేస్తారని పేర్కొన్నారు. అభ్యర్థులు, ఎన్నికల అధికారుల మధ్య ఫోన్ నంబర్లు పరస్పరం అందుబాటులో ఉండాలని సూచించారు.
48 వార్డులు – 110 పోలింగ్ కేంద్రాలు :
మొత్తం 48 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా, 11, 12, 21 వార్డుల్లో వార్డు సభ్యుల ఎన్నిక లేనప్పటికీ చైర్పర్సన్ ఎన్నిక ఉంటుందని తెలిపారు. 48 వార్డుల పరిధిలో మొత్తం 110 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ జరుగుతుందని కమిషనర్ వివరించారు.

