🟡 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ న్యూస్ :
డిసెంబర్ 10 నుంచి కొత్త పాలనకు శ్రీకారం
ప్రతి బుధవారం ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి
ప్రజా సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం
ప్రజా సంక్షేమం, నగరాభివృద్ధి, పారదర్శక పాలనకు పెద్దపీట వేస్తామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, నూతన మేయర్ రెడ్డి అప్పలనాయుడు స్పష్టం చేశారు. మేయర్‌గా అప్పలనాయుడు ప్రమాణ స్వీకారం అనంతరం కార్పొరేషన్ కార్యాలయం వద్ద నిర్వహించిన విజయోత్సవ సభలో వారు మాట్లాడారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ :
ప్రజలు ఇచ్చిన భారీ విజయాన్ని బాధ్యతగా భావించి, కార్పొరేటర్ల సమన్వయంతో మౌలిక వసతులు మెరుగుపరచాలని, ఏలూరును స్వర్ణ ఏలూరుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు.
ఈ సందర్భంగా మేయర్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ :
కార్పొరేషన్‌లో అవినీతికి అడ్డుకట్ట వేసి, ఆదాయ వనరులను పెంచడమే లక్ష్యమని, డిసెంబర్ 10 నుంచి శాఖల వారీగా అధికారులతో, కార్పొరేటర్లతో సమన్వయ సమావేశాలు నిర్వహించి పాలనను గాడిలో పెడతామన్నారు. ప్రతి బుధవారం ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యమిస్తామని వెల్లడించారు.
కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొని మేయర్‌ను అభినందించారు. కూటమి నాయకులు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు నూతన మేయర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

