🟡 ఏలూరు జిల్లా : ఏలూరు ఎంపీ కార్యాలయం : ది డెస్క్ :
నేవీ ఆయుధ డిపో ప్రాజెక్టుకి బ్రేక్
జిల్లాకు పరిశ్రమలు తెచ్చేందుకు ప్రయత్నిస్తుంటే కొందరు అడ్డుపడుతున్నారు.
జిల్లాలో బీసీ హాస్టల్స్ ఏర్పాటుకు ప్రయత్నాలు.
ఏలూరు ఎంపీ క్యాంపు కార్యాలయంలో గ్రీవెన్స్.
భారీగా తరలివచ్చిన ప్రజలు, సమస్యలను అడిగి తెలుసుకున్న ఎంపీ.
30 మంది లబ్ధిదారులకు 22 లక్షల విలువైన CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎంపీ
కొయ్యలగూడెం వద్ద తలపెట్టిన నేవీ ఆయుధ డిపో ప్రాజెక్టు ఏర్పాటు నిర్ణయం విరమించుకున్నట్లు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. గురువారం ఏలూరులోని తన క్యాంపు కార్యాలయంలో ఎంపీ మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఎంపీ మీడియాతో మాట్లాడుతూ ,:
90శాతం మంది రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చినప్పటికీ, కొందరు స్థానిక నేతలు ప్రజల్లో అపోహలు సృష్టించి, ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయడంతో సమస్య ఏర్పడిందన్నారు. ప్రస్తుతానికి నేవీ డిపో ప్రాజెక్టు ఏర్పాటు పనులు ఆపివేసినట్లు ఎంపీ స్పష్టం చేశారు.
కోకో సిటీ ఏర్పాటుకు భూముల పరిశీలన జరుగుతోందన్నారు.
కోకో సిటీ ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కోకో సిటీ ఏర్పాటు పై ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పిన ఎంపీ, ఎక్కడ పెట్టేది త్వరలోనే నిర్ణయిస్తామని తెలిపారు. ఏలూరు పార్లమెంటులో అభివృద్ధి జరగాలని కోరుకుంటూ పరిశ్రమలు తీసుకువచ్చేందుకు తాను ప్రయత్నిస్తుంటే కొంతమంది అడ్డుపడటం దురదృష్టకరమన్నారు. ఏదేమైనా అభివృద్ధి పనులు ఆగకుండా చూస్తామన్నారు. ఆయిల్ పామ్ పంటకు మంచి భవిష్యత్తు ఉందని, జిల్లాలో పొగాకు సాగు చేస్తున్న రైతులు కూడా కొంతమేర పొగాకు పంటను తగ్గించుకొని, పామాయిల్ పంట వైపు మళ్ళాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఏడాది ఆయిల్ పామ్ గెలలకు గతంలో ఎన్నడూ లేనంత మంచి ధర లభిస్తోందన్న ఎంపీ, భవిష్యత్తులో మరింత ధరలు పెరుగుతాయని చెప్పారు. జిల్లాలో ఇప్పటికే 56 స్మశాన వాటికలకు నిధులు కేటాయించామని, అనేక చోట్ల నిర్మాణ పనులు కూడా మొదలయ్యాయని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వివరించారు. నూజివీడు ప్రాంతంలో ఇటీవలే కొన్ని పరిశ్రమలు వచ్చాయని, మరికొన్ని పరిశ్రమలు తీసుకువచ్చేందుకు తన వంతు కృషి చేస్తున్నామని, పరిశ్రమల స్థాపనకు జిల్లాలో భూముల కొరత అడ్డంకిగా మారిందన్నారు. ఏలూరులో పబ్లిక్ లైబ్రరీ పునర్మాణ పనులు కూడా ఈ సంవత్సరంలోనే మొదలు పెడతామని అన్నారు. జిల్లాలో బీసీ హాస్టల్స్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ద్వారకాతిరుమలలో ఒక కళ్యాణమండపం నిర్మాణానికి నాయి బ్రాహ్మణుల సంఘం తరపున కోరగా.. నిబంధనలు సవరించి అనుమతులు మంజూరు చేయాల్సిందిగా ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరామని, త్వరలోనే అనుమతులు వస్తాయని ఆశిస్తున్నానన్నారు.
ఏలూరు పార్లమెంటు పరిధిలో ప్రతి పల్లెకు రోడ్డు సౌకర్యం :
ఏలూరు పార్లమెంటులో ప్రతి పల్లెకి రోడ్డు సౌకర్యం ఉండాలనేది తన లక్ష్యమన్న ఎంపీ, ఇప్పటికే అనేక గ్రామాల్లో రోడ్లు నిర్మించామని, ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా మరికొన్ని రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.

CMRF చెక్కులు పంపిణీ :
ఉదయం ఏలూరు ఎంపీ క్యాంపు కార్యాలయంలో 30 మంది లబ్ధిదారులకు 22 లక్షల విలువైన CMRF చెక్కులను పంపిణీ చేశారు. గత 23 నెలల్లో వివిధ ఆరోగ్య సమస్యలతో వచ్చిన 1200 మంది లబ్ధిదారులకు CMRF ద్వారా ఆర్ధిక సాయం అందించగలిగామన్నారు.
గ్రీవెన్స్ :
గ్రీవెన్స్ కోసం ప్రజలు భారీగా తరలి రావడంతో ఎంపీ క్యాంపు కార్యాలయం కిక్కిరిసిపోయింది. వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నం చేశారు.

టిడిపి నేతకు నివాళులర్పించిన ఎంపీ
పెదపాడు మండలం కొత్తూరు వెళ్ళిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ఈరోజు ఉదయం మరణించిన గ్రామ టీడీపీ నేత గోవిందరావు తండ్రి ఆవల పెద్ద సోమయ్య మృతదేహానికి నివాళులు అర్పించారు.
Eluru MP Putta Mahesh Halts Navy Depot Project Amid Land Crunch, Eyes Industry Boost
Eluru MP Putta Mahesh Kumar announced today that the proposed Navy weapons depot at Koyyalagudem has been shelved due to land shortages and local opposition, even as he redoubles efforts to attract industries to the district.
Speaking to media at his camp office here, the MP revealed that while 90% of farmers were willing to donate land, a few local leaders spread misinformation, inciting unrest. “Some are obstructing our push for development,” he lamented, confirming the project’s indefinite pause. He highlighted ongoing land surveys for a “Coco City” initiative, with Chief Minister N. Chandrababu Naidu personally overseeing site selection. “We’ll decide soon,” Mahesh assured, vowing to ensure development doesn’t stall.
Land scarcity emerged as a key hurdle for industrial setup, with the MP noting recent factories in Nujiveedu and plans for more. He urged tobacco farmers to switch partially to oil palm, citing record prices this year and promising future gains. Infrastructure updates included funds for 56 cremation grounds (construction underway at several), a public library revamp, BC hostels, and roads to every village via NREGS funds. In Dwarakatirumala, approvals for a Kalyanamandapam sought by the Nai Brahmin association are expected soon after rule tweaks.
The MP distributed CMRF cheques worth ₹22 lakh to 30 beneficiaries, bringing aid to 1,200 people with health issues over 23 months. His camp office buzzed with crowds from various segments, where he heard grievances and promised resolutions.
Mahesh paid respects to the late Avala Pedda Somayya, father of TDP leader Govindaraju, in Kothuru, Pedapadu mandal.
“Every village in Eluru Parliament deserves roads and growth,” he emphasized, underscoring his commitment despite hurdles.

