The Desk … Rampachodavaram : ఉపాధిహామీ పథకం సిబ్బందిపై వేటు

The Desk … Rampachodavaram : ఉపాధిహామీ పథకం సిబ్బందిపై వేటు

🔴 పోలవరం జిల్లా : రంపచోడవరం : ది డెస్క్ :

విధులుపట్ల నిర్లక్ష్యం వహించిన రంపచోడవరం, ఎటపాక మండలాల ఏపీఓలు సస్పెన్షన్

లక్ష్యం మేరకు పనిచేయని సాంకేతిక, క్షేత్రస్థాయి సహాయకులను విధుల నుంచి తప్పించిన జిల్లా యంత్రాంగం

గిరిజనుల సంక్షేమం కోసం పనిచేయని ఉపాధి సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించిన కలెక్టర్ దినేష్ కుమార్.

విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఉపాధిహామీ సిబ్బందిపై కలెక్టర్ కే. దినేష్ కుమార్ కొరడా ఝలిపించారు. గిరిజనుల సంక్షేమనికి తూట్లు పొడుస్తే ఎంతటి వారిపైన చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు. ఉపాధిహామీ పథకంలో లక్ష్యం మేరకు పనిచేయని రంపచోడవరం, ఎటపాక అడిషనల్ ప్రోగ్రాం అధికారులు బందిల సత్యనారాయణ, ఎం. రెడ్డి బాబులను సస్పెండ్ చేసి విధులనుంచి తొలగించారు. అలాగే విధులు సక్రమంగా నిర్వర్తించని సాంకేతిక సహాయకులు ఆర్ వెంకట లక్ష్మీ, కే.విజయ్ కుమార్, ఎం.వెంకట లక్ష్మీ, క్షేత్రసహాయకులు సుడిపాక మల్లేశ్వరావు, జీ. సుబ్బారావు, టి. కన్నబ్బాయి, వి. విశ్వనాధ్ ను సస్పెండ్ చేసి విధులనుంచి తొలగించారాని పోలవరం జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ మహేశ్వరావు తెలిపారు.

సందర్బంగా ప్రాజెక్ట్ డైరెక్టర్ మాట్లాడుతూ :

కలెక్టర్ దినేష్ కుమార్ పోలవరం జిల్లాకు ప్రతిరోజూ 1 లక్ష పని దినాలు గిరిజన శ్రామికులకు పని కల్పించాలని టార్గెట్ ఇచ్చారని ఉపాధిహామీ పథకం సిబ్బంది తప్పకుండా టార్గెట్ అచీవ్ చేయాలని లేకపోతే తప్పకుండా శాఖపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.