12 మంది లబ్ధిదారులకు రూ.6.43 లక్షల చెక్కులు అందజేసిన డా. కామినేని శ్రీనివాస్
🔴 ఏలూరు జిల్లా : కైకలూరు : ది డెస్క్ :
గవర్నమెంట్ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్, కైకలూరు శాసనసభ్యులు డా. కామినేని శ్రీనివాస్ గురువారం మండలంలోని వరహాపట్నం గ్రామంలోని తన నివాసంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుంచి మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
హాస్పిటల్ చికిత్స ఖర్చుల నిమిత్తం మంజూరైన ఈ ఆర్థిక సహాయాన్ని మొత్తం 12 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందులతో చికిత్స పొందలేని పేద కుటుంబాలకు సీఎం సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతోందన్నారు. ప్రజలకు అవసరమైన సహాయం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్‌డీఏ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
లబ్ధిదారుల వివరాలు:
- ఆలపాడు గ్రామానికి చెందిన పన్నాస లక్ష్మి ప్రసన్నకు రూ.95,776
- కైకలూరుకు చెందిన షేక్ మటీన్‌కు రూ.63,542
- కోడూరుకు చెందిన తమ్మిశెట్టి నాగలక్ష్మికి రూ.61,684
- అయ్యవారుద్రవరం గ్రామానికి చెందిన కట్టా కొండయ్యకు రూ.60,234
- కైకలూరుకు చెందిన చొప్పెర్ల సీతారత్నంకు రూ.55,046
- తామరకొల్లుకు చెందిన పావులూరి విజయ్ ప్రతాప్‌కు రూ.54,389
- పెరికేగూడెంకు చెందిన బాదిన సుబ్బారెడ్డికి రూ.53,914
- పెరికేగూడెంకు చెందిన పెరుమాళ్ళ బాలరాజు రెడ్డికి రూ.47,660
- సానారుద్రవరం గ్రామానికి చెందిన మారుబోయిన ప్రమీలకు రూ.46,185
- గన్నవరం గ్రామానికి చెందిన అరికేపూడి వెంకటేశ్వరరావుకు రూ.40,799
- తాడినాడ పంచాయతీ సున్నంపూడికి చెందిన కొల్లాటి లక్ష్మికి రూ.39,884
- కైకలూరుకు చెందిన షేక్ ఆసియా బేగంకు రూ.24,001 చొప్పున చెక్కులు అందజేశారు.
మొత్తం 12 మంది లబ్ధిదారులకు రూ.6,43,054 ఆర్థిక సహాయం మంజూరైనట్లు తెలిపారు.

