The Desk … Eluru : ‎చింతలపూడి, పోలవరం నియోజకవర్గాలలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పర్యటన

The Desk … Eluru : ‎చింతలపూడి, పోలవరం నియోజకవర్గాలలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పర్యటన

🟡 ఏలూరు జిల్లా : ఏలూరు ఎంపీ కార్యాలయం : ది డెస్క్ :

నూతన వధూవరులకు ఎంపీ ఆశీర్వాదం

చింతలపూడి, పోలవరం నియోజకవర్గంలలో పార్టీ నాయకుల ఇంట వివాహాది శుభకార్యాలకు హాజరైన ఎంపీ పుట్టా మహేష్.

గురవాయిగూడెం వద్ద కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్.

జాయింట్ కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడిన ఎంపీ.


మిల్లర్లతో మాట్లాడి ధాన్యం కొనుగోలుకు వేగంగా చర్యలు తీసుకోవాలని జేసీకి సూచించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్

‎ఏలూరు పార్లమెంట్ లో గురువారం  ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పలు గ్రామాలలో పర్యటించారు. చింతలపూడి, పోలవరం నియోజకవర్గంలలో పలువురు పార్టీ నాయకుల ఇంట వివాహాది శుభకార్యాలకు ఎంపీ హాజరయ్యారు. ముందుగా ఉదయం చింతలపూడి నియోజకవర్గం, ‎లింగపాలెం మండలం, కలరాయనగూడెం గ్రామానికి చెందిన నీరుకొండ శ్రీధర్, శైలజ దంపతుల కుమారుడు శ్రీవీర్  వివాహము కృష్ణాజిల్లా గుడివాడ వాస్తవ్యులు యార్లగడ్డ వెంకట శ్రీనివాసరావు, చందన దంపతుల పుత్రిక రవళికతో గురువారం జరిగింది. వరుని తల్లిదండ్రుల కోరిక మేరకు గురువారం ఉదయం కలరాయనగూడెంలోని వరుని ఇంటికి వెళ్లిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్, వరుని ఆశీర్వదించి “మహేష్ అన్న పెళ్లి కానుక” బహుమతులను అందజేశారు.

అనంతరం టి నర్సాపురం మండలం తిరుపతిపాడు గ్రామంలో పార్టీ స్థానిక నేత పేరుబోయిన శ్రీనివాసరావు, విజయలక్ష్మి దంపతుల కుమారుడు ధర్మతేజ వివాహ రిసెప్షన్ వేడుకకు ఎంపీ హాజరయ్యారు. అక్కడి నుంచి జంగారెడ్డిగూడెం మీదుగా పోలవరం బయలుదేరిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మార్గమధ్యలో ‎గురవాయిగూడెం వద్ద కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు.ఈ సందర్భంగా వాతావరణం మారి వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వార్తలతో ఎంపీ వద్ద రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.

స్పందించిన ఎంపీ వెంటనే జాయింట్ కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడారు. మిల్లర్లతో మాట్లాడి ధాన్యం కొనుగోలుకు వేగంగా చర్యలు తీసుకోవాలని జేసీ కి సూచించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ రైతులకు ధైర్యం చెప్పారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో పోలవరం చేరుకున్న ఎంపీ ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాస్ ఇంటికి వెళ్లి శనివారం వివాహం జరగనున్న బొరగం మేనల్లుడు వెంకటేష్ గౌతమ్ ను ఆశీర్వదించి బొరగం, ఇతర నేతలు, కార్యకర్తలతో కలిసి తేనీటి విందులో పాల్గొన్నారు.