The Desk… Mudinepalli : శ్రీ రాజశ్యామల మహాయజ్ఞం..అమరావతి అభివృద్ధి కొరకై..డాక్టర్ మనోజ్, అంబుల వైష్ణవిల తపన

The Desk… Mudinepalli : శ్రీ రాజశ్యామల మహాయజ్ఞం..అమరావతి అభివృద్ధి కొరకై..డాక్టర్ మనోజ్, అంబుల వైష్ణవిల తపన

🔴 ఏలూరు జిల్లా : ముదినేపల్లి మండలం : ముదినేపల్లి : ది డెస్క్ :

ముదినేపల్లి గ్రామంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ మనోజ్ ఆసుపత్రి ప్రాంగణంలో… అమరావతి అభివృద్ధిలో భాగంగా… వేద పండితుల ఆధ్వర్యంలో రాజశ్యామల మహా యజ్ఞాన్ని డాక్టర్ మనోజ్ మరియు అమరావతి బ్రాండ్ అంబాసిడర్ ఆంబుల వైష్ణవి ఘనంగా నిర్వహించారు.

సందర్భంగా డాక్టర్ మనోజ్ మాట్లాడుతూ :

నేడు మా స్వగృహం నందు రాజశ్యామల యజ్ఞం అమరావతి అభివృద్ధి కొరకై చేసామని, అమరావతి తొందరగా అభివృద్ధి చెందాలని రాష్ట్ర పౌరులoదరూ సంతోషంగా ఉండాలని, మన బిడ్డలు వేరే ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగాలు చేయకుండా మన సొంత రాష్ట్రంలోనే, సొంత స్థలంలోనే, అమరావతిలోనే ఉద్యోగ అవకాశాలు ఉంటాయి కాబట్టి అమరావతిని అభివృద్ధి చేసుకుందాం మన రాష్ట్రాన్ని మనం త్వరిత గతిన నిర్మించుకుందామని, కూటమి ప్రభుత్వం అందరి దయవల్ల అమరావతిని సాధించుకున్నామని.. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి, నేను నా కుమార్తె రాజశ్యామల యజ్ఞం చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, రాజధానికి భూములు ఇచ్చిన రైతులందరికీ పాద పూజ చేసి సన్మానిస్తున్నామని, రాష్ట్రం సుభిక్షం కోసం, అమరావతి నిర్మాణంలో పాలిభాగస్తులగుటకై ప్రతి ఒక్కరు 116/- రూపాయలు సీఆర్డీఏ ఎకౌంట్కు క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లించి సహకరించచాలని కోరారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి డాక్టర్ మనోజ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

సందర్భంగా అంబుల వైష్ణవి మాట్లాడుతూ…

అమరావతి అభివృద్ధి కోసం శ్రీ రాజశ్యామల మహాయజ్ఞం మా ఆస్పత్రి ప్రాంగణంలో అందరి సహకారంతో ఘనంగా నిర్వహించామని, గత రెండేళ్లుగా అమరావతి నిర్మాణానికై 116/- రూపాయలు సి ఆర్ డి ఏ అకౌంట్ కు విరాళాలు సేకరిస్తున్నామని, అదేవిధంగా నేను, నా తండ్రి అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు పాదపూజ చేసి సన్మానిస్తున్నామని… ఇందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

Sri Rajashyamala Mahayajna held in Mudinepalli for Amaravati’s development

A grand Sri Rajashyamala Mahayajna was performed at the premises of Dr Manoj’s hospital in Mudinepalli village, Mudinepalli mandal, Eluru district, to seek the prosperity and swift development of the state capital, Amaravati. Presided over by Vedic scholars, the ritual was jointly organised by prominent physician Dr Ambul Manoj and Amaravati brand ambassador Ambul Vaishnavi, drawing a large gathering of devotees and well‑wishers.

Speaking on the occasion, Dr Manoj said the rajashyamala yajna was conducted at his residence to invoke blessings for Amaravati’s rapid growth. He appealed to all citizens to contribute ₹116 to the CRDA account through a QR code, stressing that a developed Amaravati would generate local employment and reduce the need for youth to migrate out of the state. He also offered padapuja and felicitations to the farmers who donated land for the capital, and thanked the State Government for its support.

Ambula Vaishnavi, addressing the gathering, highlighted that the ritual has been part of a sustained campaign over the past two years to raise ₹116‑per‑donor contributions for Amaravati’s construction. She reiterated gratitude to the supporting public and echoed the call for collective participation in building the capital, which she described as a “people’s project” for Andhra Pradesh’s future.