The Desk … Vunguturu : ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీడీవో

The Desk … Vunguturu : ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీడీవో

🔴 ఏలూరు జిల్లా :ఉంగుటూరు మండలం : నీలాద్రిపురం : ది డెస్క్ :

గ్రామంలో పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో ఉంగుటూరు ఎంపీడీవో జి ఆర్ మనోజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని కొంతమంది పెన్షన్ లబ్ధిదారులతో ఆయన మాట్లాడారు.

ఎంపీడీవో ఆరా :

పెన్షన్ పంపిణీ సమయంలో, పంపిణీ చేసిన తర్వాత పెన్షన్ పంపిణీ అధికారులు మంచిగా ప్రవర్తిస్తున్నారా? ఇంటి దగ్గరే ఇస్తున్నారా? పెన్షన్ పంపిణీ చేస్తున్నప్పుడు ఏమైనా లంచాలు అడుగుతున్నారా? అని ఎంక్వయిరీ చేశారు.

గ్రామస్థుల నుండి స్పందన :

అట్లాంటివి ఏమీ లేవని మాకు మంచిగానే పెన్షన్ అందుతుందని ఎవరూ ఏ విధమైన డబ్బులు అడగట్లేదని ఇంటి వద్దనే ఇస్తున్నారని కొంతమంది పింఛన్దారులు ఎంపీడీవో కి తెలియజేశారు.

ఉపాధిహామీ & జలధార – జలహారతి పనులను పరిశీలించిన ఎంపీడీవో మనోజ్ :

ఉంగుటూరు నారాయణపురం మధ్య ఉన్న అటవీ ప్రాంతంలోని దుబ్బలకుంట గొల్లలకుంట మరియు వాటి మధ్య జరుగుతున్న జలధార పనులను ఉంగుటూరు ఎంపీడీవో జి ఆర్ మనోజ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పలు గ్రూపుల మస్తర్లు పరిశీలించారు. అనంతరం ఉపాధి హామీ
శ్రామికులతో మాట్లాడారు.

ఉపాధి హామీ శ్రామికులకు ఎంపీడీవో మనోజ్ సూచన :

కొలతల ప్రకారం పని చేయాలని రోజుకు 307/- రూపాయలు వచ్చే విధంగా పనిచేయాలని, బినామీ మస్తర్లకు అవకాశం లేని విధంగా పని చేయాలని పని ప్రదేశంలో పొలుగు పారా తట్ట ఎక్కువగా ఉండే విధంగా చూసుకోవాలని అప్పుడే ఎక్కువ పని పరిమాణం పెరుగుతుందని తద్వారా ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం ఉందని ఆయన ఉపాధి హామీ శ్రామికులకు సూచించారు.

ఎంపీడీవోతో పాటు ఏపీఓ రమణ ఫీల్డ్ అసిస్టెంట్ కనకారావు తదితరులు ఉన్నారు.