The Desk…Vunguturu : జనాభా లెక్కలకు సహకరించండి

The Desk…Vunguturu : జనాభా లెక్కలకు సహకరించండి

మే1 నుండి 30 వరకు జరిగే జనగణన ప్రక్రియకు గృహస్తులు సహకరించండి➖ఎంపీడీవో మనోజ్

🔴 ఏలూరు జిల్లా : ఉంగుటూరు మండలం : ఉంగుటూరు : ది డెస్క్ :

రేపటి నుండి ప్రారంభమయ్యే జనాభా లెక్కలకు సహకరించండి. మే ఒకటో తేదీ నుంచి మే 30 తేదీ వరకు జరిగే జనాభా లెక్కల్లో భాగంగా గృహాలు, గృహాలలో ఉండే కుటుంబాల సర్వేకి ప్రజల సహకరించాలని ఉంగుటూరు ఎంపీడీవో జి ఆర్ మనోజ్ కోరారు.

ఉంగుటూరు గ్రామపంచాయతీ సమీపంలోని కమ్యూనిటీ హాల్లో జరిగిన జనాభా లెక్కల సేకరణ అధికారులు, పర్యవేక్షకులుకు నిర్వహించిన ఆఖరి శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

సందర్భంగా ఎంపీడీవో మనోజ్ మాట్లాడుతూ :

జనాభా లెక్కల వివరాలు ఇవ్వవలసిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడికి ఉందని, ఈ చారిత్రక ఘట్టంలో ప్రతి ఒక్కరు పాలుపంచుకోవాలని, ఈ సెంసెస్ నిర్వహణలో మొదటిసారి పాల్గొంటున్న సిబ్బంది బాధ్యతతో, నిబద్దతతో ఓర్పుతో గృహాలు వివరాలు, కుటుంబాల వివరాలు సేకరించాలని, అదేవిధంగా ప్రతి ఒక్క ఎన్నుమీరేటర్ వద్ద మ్యాపులు గుర్తింపు కార్డులు ఉండాలని అదేవిధంగా వేసవిలో ఈ కార్యక్రమం జరుగుతున్నందున విధి నిర్వహణలో వడదెబ్బకు గురయ్యే పరిస్థితులు తలెత్తకుండా అందరూ ముందస్తు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన కోరారు. సర్వే పూర్తయ్యే వరకు కూడా ఎవరు ఈ విధమైన సెలవులు పెట్టరాదని అనుమతి లేకుండా ఎవరు విధి నిర్వహణకు రాకపోవటం గాని చేయకూడదని అలా చేసిన ఎడల కఠిన మైన శిక్షలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఈ చారిత్రక ఘట్టంలో కూటమి నాయకులు కూడా పాల్గొని ఈ జనాభా లెక్కల్లో భాగంగా నిర్వహించే గృహాలు, గృహంలోని కుటుంబాల సేకరణ సజావుగా జరిగే విధంగా సహకరించాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవోతో పాటు పర్యవేక్షకులు మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Residents Urged to Cooperate with Census Survey in Unguturu constancy

Officials have called upon residents to actively cooperate with the upcoming population census scheduled from May 1 to May 30. Unguturu MPDO G.R. Manoj made this appeal while addressing officials and supervisors during the final training session held at the community hall near the Unguturu Gram Panchayat.

He emphasized that providing accurate household and family details is a fundamental responsibility of every citizen, describing the census as a significant national exercise. Manoj instructed enumerators, many of whom are participating for the first time, to carry out their duties with dedication, patience, and accountability while collecting data from households.

Highlighting operational guidelines, he stated that every enumerator must carry identification cards and survey maps. Given the ongoing summer conditions, he advised staff to take precautionary measures to avoid heat-related illnesses while on duty.

The MPDO also issued a strict warning against unauthorized leave or negligence during the survey period, stating that disciplinary action would be taken against defaulters. He further urged local leaders to extend their support to ensure smooth and efficient completion of the census process.

Supervisors and revenue staff were present at the training session.