ఏలూరు జిల్లా : కైకలూరు క్రైమ్ : ది డెస్క్ :

స్థానిక పోలీస్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న కృష్ణా కోఆపరేటివ్ బ్యాంక్ ఏటీఎం కేంద్రంలో దొంగతనానికి యత్నం చోటుచేసుకుంది. ఏప్రిల్ 24వ తేదీ తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ఏటీఎం సెంటర్‌లోకి చొరబడి యంత్రాన్ని ధ్వంసం చేసి నగదు దోచుకునేందుకు ప్రయత్నించాడు.

అయితే ఏటీఎం యంత్రం తెరుచుకోకపోవడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఉదయం బ్యాంక్‌కు వచ్చిన స్వీపర్ ఘటనను గమనించి మేనేజర్‌కు సమాచారం అందించాడు. మేనేజర్ ఫిర్యాదు మేరకు కైకలూరు టౌన్ ఎస్‌ఐ డి. వెంకట్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏటీఎం సెంటర్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా నిందితుడు చేతులతో యంత్రాన్ని ధ్వంసం చేసి దొంగతనానికి యత్నించినట్లు గుర్తించారు.
ఏలూరు నుంచి వచ్చిన క్లూస్ టీం సిబ్బంది సంఘటన స్థలాన్ని పరిశీలించి వేలిముద్రలు సేకరించారు. దొంగతనానికి యత్నించిన వ్యక్తి గురించి ఎవరైనా సమాచారం అందిస్తే కైకలూరు టౌన్ సీఐ ఏవీఎస్ రామకృష్ణ (9440796434), ఎస్‌ఐ డి. వెంకట్ కుమార్ (9440796433)లకు తెలియజేయాలని పోలీసులు కోరారు.

