The Desk … Eluru : అభయాంజనేయునికి ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ పుట్టా మహేష్

The Desk … Eluru : అభయాంజనేయునికి ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ పుట్టా మహేష్

🟡 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

హనుమాన్ జంక్షన్ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని మంగళవారం ఉదయం ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ దర్శించుకున్నారు. ముసునూరు, నూజివీడి మండలాల్లో కార్యకర్తలు, నేతలను కలిసేందుకు వెళుతూ హనుమాన్ జంక్షన్ సెంటర్ లో ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద ఆగిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు ఆలయ మర్యాదలతో ఎంపీకి స్వామి దర్శనం చేయించి ఆశీర్వచనం, స్వామితీర్థ ప్రసాదాలు అందజేశారు.