ఏలూరు జిల్లా : ముదినేపల్లి : పేరూరు : ది డెస్క్ :

మండలంలోని పెర్రూరు గ్రామానికి చెందిన పరిసపోగు పేతురు (55) మూత్రపిండాల వ్యాధితో శనివారం సాయంత్రం మృతి చెందారు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆయన కుటుంబం అత్యంత నిరుపేద స్థితిలో ఉంది. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
ఈ క్రమంలో విషయం తెలుసుకున్న అమరావతి బ్రాండ్ అంబాసిడర్ వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి తన తండ్రి ద్వారా మృతుని అంత్యక్రియల నిర్వహణ కోసం రూ.5,000 ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

