ఏలూరు జిల్లా : ముదినేపల్లి : ది డెస్క్ :

ముదినేపల్లిలో జలం-జీవం కార్యక్రమంలో శ్రమదానం నిర్వహించి గ్రామంలో పేరుకుపోయిన చెత్తను తొలగించారు. స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర లక్ష్యంగా చేపట్టిన కార్యక్రమంలో అధికారులు స్వయంగా చీపురు పట్టి పారిశుద్ధ్య పనుల్లో పాల్గొన్నారు. కాలువల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్త వేయడం వల్ల నీటి ప్రవాహానికి ఆటంకం కలిగి దోమలు పెరిగి ప్రజా ఆరోగ్యానికి ముప్పు ఏర్పడుతుందని హెచ్చరించారు.

నీటి వనరుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, భూగర్భ జలాల కలుషితాన్ని నివారించాలంటే కాలువల్లో చెత్త వేయకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ‘జలం ఉంటేనే జీవం’ అనే భావనతో స్వచ్ఛ ఆంధ్ర సాధనకు ప్రజలంతా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన, సుభిక్షమైన ఆంధ్ర నిర్మాణానికి కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు.

కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి రమేష్, వార్డు సభ్యులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ, ఏఎంసీ చైర్మన్, నీటి సంఘం ప్రతినిధులు, ఎన్‌డీఏ కూటమి నాయకులు, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

