🔴 ఎన్టీఆర్ జిల్లా : జగ్గయ్యపేట : ది డెస్క్ :

ఇంటర్ ఫలితాలలో వాగ్దేవి కళాశాల విద్యార్థులు స్టేట్ ర్యాంకులు సాధించడంతోపాటు, టాపర్స్ గా నిలిచినట్లు వాగ్దేవి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బుస్సా సురేష్, కరస్పాండెంట్ బుస్సా సరితలు తెలిపారు. బుధవారం సీనియర్, జూనియర్ ఇంటర్ ఫలితాలలో వాగ్దేవి కళాశాల విద్యార్థులు సాధించిన ఫలితాలను వివరించారు. జూనియర్ సీఈసీలో అనూష 494 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించినట్లు తెలిపారు.

చారిత్రాత్మకంగా విద్యార్థిని అనూష ప్రతిభ చూపి రాష్ట్రస్థాయిలో అగ్రగామిగా ర్యాంకు సాధించడం జరిగిందన్నారు. ఇంటర్ బైపీసీలో అమృతవర్ష 443 మార్కులతో స్టేట్ 8 ర్యాంకు, టౌన్ ఫస్ట్ గా నిలిచినట్లు పేర్కొన్నారు. జూనియర్ ఇంటర్ మమతా నాయుడు 472 మార్కులతో స్టేట్ థర్డ్ ర్యాంకు, టౌన్ ఫస్ట్ ర్యాంక్ సాధించినట్లు, ఎంపీసీలో దుర్గకుమారి 460 మార్కులతో టౌన్ టాపర్గా నిలిచినట్లు వివరించారు.

సీనియర్ ఇంటర్ ఎంపీసీలో అరవింద్ 967 మార్కులు, సీనియర్ ఎన్టీఆర్ బైపీసీలో వర్షిత 947 మార్కులు సీనియర్ ఇంటర్లో 887 మార్కులతో పాల్ టౌన్ ఫస్ట్ గా టాపర్స్ గా నిలిచారన్నారు ఇంటర్ నర్సింగ్ లో జి నవ్య 440 మార్కులు సాధించి టౌన్ టాపర్ గా నిలిచారని వివరించారు. ఈ అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులను అధ్యాపక బృందాన్ని, అకడమిక్ డైరెక్టర్ జ్వలిత్ సాయి లహరి లను అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంటర్ ఫలితాలలో అత్యుత్తమ ఫలితాలు వాగ్దేవి కళాశాల విద్యార్థినులు సాధించడం జరిగిందని అన్నారు.
Vagadevi College Students Bag State Ranks in Intermediate Results
Students from Vagadevi College have shone brightly in the Intermediate results, securing multiple state ranks and topping the town charts, as announced by Principal Dr. Bussa Suresh and Correspondent Bussa Sarita.
In Junior CEC, Anusha clinched State First Rank with 494 marks—a historic feat for the college. Amruthavarshini secured State 8th Rank (443 marks) in Inter BPC, while Mamata Naidu grabbed State Third (472 marks) in Junior Inter, both as town toppers. Durga Kumari topped town in MPCA with 460 marks.
Senior Inter stars included Arvind (967 marks in MPC), Varshita (947 in MPC), Paul (887, town first in BPC), and J. Navya (440 in Nursing, town topper).
The principal congratulated the students, faculty, and Academic Director Jwalith Sai Lahari, hailing these as the college’s best-ever results.

