The Desk … Bhimavaram : రాష్ట్ర కార్యదర్శిగా రెండోసారి ఎన్నికైన కోళ్ల

The Desk … Bhimavaram : రాష్ట్ర కార్యదర్శిగా రెండోసారి ఎన్నికైన కోళ్ల

🟡 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ :

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా రెండోసారి నియమితులైన కోళ్ల నాగేశ్వరరావును భీమవరం నియోజవర్గంతో పాటు జిల్లాలోని పలువురు అభిమానులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాగేశ్వరావుని అభిమానులు సాలువతో సత్కరించిన, పుష్పగుచ్చo అందజేశారు.

అనంతరం నాగేశ్వరరావు మాట్లాడుతూ :

తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు స్థాపించిన నాటి నుంచి పార్టీ వెన్నంటే ఉంటూ వచ్చామని అన్నారు. జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ నాకు ఇచ్చిన పదవిని జిల్లాలోని నాయకులతో కలుపుకుని ముందుకు వెళ్లి పార్టీని మరింత బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు.