The Desk … Rampachodavaram : సుస్థిర ఆస్తుల కల్పనే లక్ష్యంగా ఉపాధిహామీ పనులు జరగాలి➖కలెక్టర్ దినేష్ కుమార్

The Desk … Rampachodavaram : సుస్థిర ఆస్తుల కల్పనే లక్ష్యంగా ఉపాధిహామీ పనులు జరగాలి➖కలెక్టర్ దినేష్ కుమార్

జిల్లా టార్గెట్ రోజుకి 90000 మ్యాన్ డేస్. లక్ష్యం మేరకు శ్రామికులకు పని కల్పించాలి

ఉపాధిహామీ సిబ్బంది క్షేత్రస్థాయిలో పనిచేయాలి

🔴 పోలవరం జిల్లా : రంపచోడవరం : ది డెస్క్ :

పోలవరం జిల్లా ఏజెన్సీలో ఉపాధి పనులు ద్వారా చేపట్టిన పనులను లక్ష్యం మేరకు పూర్తి చేయాలని, అలాగే ఏజెన్సీ ప్రాంతంలో సుస్థిర ఆస్తులు అభివృద్ధి చేసే లక్ష్యంగా ఉపాధిహామీ పనులు జరగాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఉపాధిహామీ సిబ్బందిని ఆదేశించారు. సోమవారం రంపచోడవరం ప్రొజెక్ట్ అధికారి కార్యాలయంలో కలెక్టర్ దినేష్ కుమార్ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించి పలు సూచనలు చేసారు. సిబ్బంది అందరు గ్రామాలలో పని ప్రాంతాలలో పర్యటించి గ్రామీణ శ్రామికులతో మాట్లాడి పనులు గుర్తించాలని అన్నారు.

సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ :

ఏజెన్సీలో ఉపాధి పనుల ద్వారా ప్రారంభించిన పనులని వేగవంతముగా పూర్తి చేయాలని నెలకు 8లక్షలు మ్యాన్ డేస్ లక్ష్యంగా ఉపాధి పనులు పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. తాను ఆకస్మిక పర్యటనలు చేస్తానని, పని కావాలన్నా ప్రతి గ్రామీణ శ్రామికుడికి పనులు కల్పించి లైవ్లీ హుడ్ ఇవ్వాలని అన్నారు.
నూతనంగా ఏర్పడిన పోలవరం జిల్లాలో ఉపాధిహామీ పనులు సమర్ధవంతంగా నిర్వహిస్తే శ్రామికుల సంక్షేమంతో పాటుగా పోలవరం జిల్లాని ప్రగతి పథంలో నిలపచ్చని అన్నారు. ఉపాధిహామీ పథకంలో అక్రమాలు జరుగుతే సంబంధిత సిబ్బంది మీద చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.

ఈ సమీక్షా సమావేశంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్, ఏపీడీ రాంబాబు, పోలవరం జిల్లాలో ఉన్న ఏపీఓలు, ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్, ఏపీవో సురేష్, ,టెక్నికల్ అసిస్టెంట్ వీరన్న తదితరులు పాల్గొన్నారు.

MGNREGA Works Must Focus on Sustainable Assets
Polavaram Collector

District Collector Dinesh Kumar on Monday directed MGNREGA staff to prioritize sustainable asset creation in agency areas and ensure timely completion of works, targeting 90,000 man-days daily and 8 lakh man-days monthly.

At a review meeting held at Rampachodavaram Project Officer’s office, the Collector urged field-level officials to visit villages, engage rural workers, and provide employment to every seeker. “Complete ongoing works swiftly, create livelihoods, and drive district progress through effective implementation,” he emphasized, warning of strict action against irregularities.

Highlighting the new district’s potential, Kumar announced surprise inspections to monitor progress. “Workers need jobs; no excuses,” he added.

The meeting was attended by Project Director Tootika Srinivasa Viswanath, APD Rambabu, APOs, engineering consultants, APO Suresh, Technical Assistant Viranna, and others.