🔴 తూగో : రాజమహేంద్రవరం : ది డెస్క్ :
రోడ్ భద్రత పాటించడం ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత
సృజనాత్మక కార్యక్రమాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు సర్టిఫికెట్లు
➖ఇంచార్జి జిల్లా కలెక్టర్ మేఘా స్వరూప్
“ప్రతి ఒక్కరూ రహదారి భద్రత నియమాలను క్రమశిక్షణగా పాటించడం మన సామాజిక బాధ్యత అని ఇంచార్జి జిల్లా కలెక్టర్ వై. మేఘా స్వరూప్ పేర్కొన్నారు.
జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని శనివారం కలెక్టరేట్లో జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈసందర్భంగా ఇంచార్జి జిల్లా కలెక్టర్ వై. మేఘా స్వరూప్ మాట్లాడుతూ..
డిగ్రీ స్థాయి విద్యార్థుల నుంచి ప్రాథమిక స్థాయి విద్యార్థుల వరకు రోడ్ సేఫ్టీ మాసోత్సవాల్లో భాగస్వామ్యం కావడం అభినందనీయమని, రహదారులు, వాహన ప్రయాణాల విషయంలో కొంత నిర్లక్ష్యం కనిపిస్తున్నదని, మానవ తప్పిదాలు, సాంకేతిక లోపాలు, రహదారి నిర్వహణ లోపాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందనీ, మీరు సమాజానికి ఆదర్శంగా నిలవాలని, తల్లిదండ్రులు, సంరక్షకులు కూడా భద్రతా ప్రమాణాల పాటింపులో అవగాహన కల్పించడంలో ముందుండాలి” అని పిలుపు ఇచ్చారు. జీబ్రా క్రాస్ వద్ద రహదారి దాటడం, లైసెన్స్ పొందడం, ట్రాఫిక్ నియమాలు పాటించడం వంటి అంశాల్లో.. “ఇతరులు పాటించడం లేదు కదా” అనే భావన వద్దని, ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా రోడ్ భద్రతా నియమాలను క్రమశిక్షణతో పాటించాలన్నారు. భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని, మీరు సమాజానికి ఆదర్శంగా నిలవాలని విద్యార్థులకు సూచించారు.

వ్యాస రచన, వక్తృత్వం, చిత్రలేఖనం, వీడియో గ్రాఫీ, షార్ట్ ఫిల్మ్, యానిమేషన్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వంటి అంశాల్లో విద్యార్థులు సృజనాత్మకతను ప్రదర్శించి రహదారి భద్రతపై సమాజానికి స్పష్టమైన సందేశం ఇచ్చారని తెలిపారు. కార్యక్రమం యొక్క ముఖ్య సందేశాన్ని విద్యార్థులకు తెలియజేస్తూ, చిన్నప్పటి నుంచే రహదారి భద్రతపై అవగాహన పెంపొందించు కోవడం సమాజానికి ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు. ఇందులో భాగస్వామ్యం కావడం అభినందనీయం అన్నారు. వివిధ అంశాల్లో ప్రతిభ చూపిన విద్యార్థినీ విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు.

రవాణాశాఖ అధికారి ఆర్. సురేష్ మాట్లాడుతూ..
జనవరి 1 నుంచి 31 వరకు నెలరోజుల పాటు వివిధ అవగాహన కార్యక్రమాలు రూపొందించి క్షేత్ర స్థాయిలో అమలు చేశామని అన్నారు. ప్రజల్లో రహదారి భద్రతపై చైతన్యం కలిగించేలా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు, ఆదిత్య డిగ్రీ కళాశాల ఎన్సీసీ విద్యార్థులతో ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ కార్యక్రమాలు కూడా చేపట్టినట్లు తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.

జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు సందర్భంగా రాజమహేంద్రవరం ఆదిత్య డిగ్రీ కళాశాల, దేవరపల్లి భాష్యం స్కూల్, అకార్డ్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, లారెల్ హై స్కూల్ విద్యార్థులు ఉత్సాహంగా, చురుకుగా పాల్గొన్నారని జిల్లా రవాణా శాఖ అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రామ్ ఇంచార్జి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సిహెచ్.
సంపత్ కుమార్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రామ్ నారాయణ్, సహాయ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్
ప్రణీత్ కుమార్, ఉమా మహేశ్వరరావు, చైతన్య సుమ, ఎస్పీ గంగిరెడ్డి – డైరెక్టర్, ఆదిత్య ఎస్పీ గంగి రెడ్డి, ఇతర కళాశాల ప్రిన్సిపాల్స్ ఫణి కుమార్, చంద్రశేఖర్, శ్రీరామ్,FSS సభ్యులు సుధాకర్ పట్నాయక్, ఎన్ ఎస్ ఎస్ కో ఆర్డినేటర్ రామకృష్ణ, ప్రోగ్రాం ఆఫీసర్ కిరణ్, రవాణా శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
National Road Safety Month Concludes Successfully in Rajamahendravaram
Road safety compliance is every citizen’s social responsibility.
Certificates awarded to students excelling in creative events
In-charge District Collector Y. Megha Swaroop emphasized that adhering to road safety rules is a disciplined social duty for everyone.
The National Road Safety Month events culminated on Saturday at the Collectorate, organized by the District Transport Department.
Addressing the gathering, Collector Swaroop praised student participation from degree to primary levels. She highlighted negligence on roads, noting accidents stem from human errors, technical faults, and poor road maintenance. “The future is in your hands—be role models for society,” she urged students, calling on parents and guardians to instill safety awareness.
She stressed crossing at zebra crossings, obtaining licenses, and following traffic rules, rejecting the mindset of “others don’t follow, why should I?” Creative contests in essay writing, elocution, painting, videography, short films, animation, and PowerPoint presentations allowed students to deliver powerful safety messages. “Fostering awareness from childhood benefits society,” she added, personally handing certificates to winners.
Transport Department officer R. Suresh detailed month-long awareness drives from January 1-31, including field-level enforcement with Aditya Degree College NCC cadets. He advised strict checks on drunk driving, triple riding, helmet, and seatbelt usage.
Students from Aditya Degree College, Devarapalli Bhashyam School, Accord School, Delhi Public School, and Laurel High School participated enthusiastically.
The event saw District Programme In-charge MV Inspector CH. Sampath Kumar, MVI Ram Narayan, AMVIs Praneeth Kumar, Uma Maheswararao, Chaitanya Sum, SP Gangireddy (Aditya Director), principals Phani Kumar, Chandrashekar, Shriram, FSS member Sudhakar Patnaik, NSS coordinator Ramakrishna, programme officer Kiran, and transport staff.

