🔴 కృష్ణాజిల్లా : పమిడిముక్కల : ది డెస్క్ :
మండలంలోని వీఆర్వోల సంతకాల ఫోర్జరీ కేసుపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ను విచారణకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశించారని సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస గౌడ్ పేర్కొన్నారు.

పమిడిముక్కలలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..
వీఆర్వో సంతకాలు ఫోర్జరీ చేసినట్లు మూడేళ్ల క్రితమే ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చినప్పటికీ పమిడిముక్కల పోలీసులు కేసు దర్యాప్తు సరిగా చేపట్టలేదని, సంతకాలను ఫోర్జరీ చేసి ప్రభుత్వ స్థలాలను ఉయ్యూరు సబజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు చేసిన విషయమై పమిడిముక్కల తహసీల్దార్ కట్టా వెంకట శివయ్య స్టేషన్లో ఫిర్యాదు చేయగా..కేసు నమోదు చేశారని, ఇప్పటివరకు కేసు దర్యాప్తు పూర్తికానందున జిల్లా ఎస్పీ స్వీయ పర్య వేక్షణలో కేసు దర్యాప్తు చేయించాలని తాను హోంశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీకుమార్ విశ్వజిత్ కు ఇచ్చానని జంపాన తెలిపారు.
Inquiry Ordered into VRO Signature Forgery Case in Pamidimukkala
Home Department Principal Secretary Sreekumar Vishwajit has directed the Director General of Police to probe alleged forgery of Village Revenue Officers’ (VRO) signatures, social activist Jampana Srinivas Goud revealed here on Friday.
Speaking to reporters, Goud said a forensic lab confirmed the forgery three years ago, yet local police failed to investigate properly. After complaints against Tahsildar Katta Venkata Shivayya for enabling government land registrations at Uyyuru Sub-Registrar office via forged signatures, a case was registered. Goud urged the District SP to monitor the probe personally, having written to the Principal Secretary.

