The Desk…Vijayawada : ఉత్తమ ఎలక్టోరల్ అధికారిగా కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ

The Desk…Vijayawada : ఉత్తమ ఎలక్టోరల్ అధికారిగా కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ

  • కలెక్టర్ బాలాజీ ని సన్మానించిన సామాజిక కార్యకర్త “జంపాన శ్రీనివాస గౌడ్

🔴 అమరావతి : విజయవాడ : ది డెస్క్ న్యూస్ :

ఉత్తమ ఎలక్టోరల్ అధికారిగా కృష్ణా జిల్లా కలెక్టర్ డీకె. బాలాజీ ఎంపికయ్యారు. 2024లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించడం, నూతన ఓటర్లను చేర్పించడం, ఎన్నికల సంఘం సూచనలను తు.చ. తప్పకుండా పాటించినందుకుగాను కలెక్టర్ బాలాజీని ఉత్తమ ఎలక్టోరల్ అధికారిగా ఎంపికచేస్తూ రాష్ట్ర ఎన్నికలసంఘం సీఈవో వివేక్ యాదవ్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు.

శనివారం జనవరి 25న – 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో అవార్డును అందుకున్న సందర్భంగా ..ఉయ్యూరు కు చెందిన సామాజిక కార్యకర్త “జంపాన శ్రీనివాస గౌడ్ “ కలెక్టర్ ను దుస్సాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలియజేశారు.