🔴ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK NEWS :
ప్రేమ, కరుణ ద్వారా మానవాళిలో ఆనందం నింపిన ఏసు క్రీస్తు జీవితం అందరికీ ఆదర్శప్రాయమని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు.
ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని క్రైస్తవ సోదరులకు ఎంపీ మహేష్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఏసు క్రీస్తు జన్మదినమైన క్రిస్మస్ పర్వదినాన్ని ప్రజలంతా సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఎంపీ మహేష్ కుమార్ ఆకాంక్షించారు.
www.thedesknews.net