The Desk … Eluru : వంగాయగూడెం స్మశానవాటికలో మహాశివుని విగ్రహావిష్కరణ

The Desk … Eluru : వంగాయగూడెం స్మశానవాటికలో మహాశివుని విగ్రహావిష్కరణ

🟡 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ న్యూస్ :

స్మశానవాటికల అభివృద్ధికి ప్రత్యేక కృషి

పవిత్ర స్థలాలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతాం

మానవుడు అంతిమంగా చేరుకునే పవిత్ర స్మశానవాటికల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించినట్లు ఏలూరు ఎమ్మెల్యే, తెదేపా జిల్లా అధ్యక్షుడు బడేటి చంటి, నగర మేయర్‌ రెడ్డి అప్పలనాయుడు పేర్కొన్నారు. నగరంలోని వంగాయగూడెం స్మశానవాటికలో ‘స్వచ్ఛ భారత్‌ వాకర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌’ ఆధ్వర్యంలో, బాలనాగు లక్ష్మి-లక్ష్మణరావు దంపతుల దాతృత్వంతో ఏర్పాటు చేసిన జ్ఞానముద్ర మహాశివుని విగ్రహాన్ని గురువారం వారు ఆవిష్కరించారు.
తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ :

స్మశానవాటికల్లో ఆహ్లాదకర, పరిశుభ్ర వాతావరణం కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఇటువంటి కార్యక్రమాలకు తమ పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. స్మశానవాటికల అభివృద్ధి తమ బాధ్యత అని, ప్రణాళికాబద్ధంగా పనులు చేపడతామని మేయర్‌ అప్పలనాయుడు తెలిపారు. అనంతరం అతిథులను అసోసియేషన్ ప్రతినిధులు సన్మానించారు.

కార్యక్రమంలో కార్పొరేటర్లు గరికిముక్కు గౌతమ్ కుమార్, పెద్దాడ వెంకటరమణ, వాకర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు మధ్యాహ్నపు వెంకటేశ్వరరావు, చిదరబోయిన శ్రీనివాసరావు, అధ్యక్షుడు కల్లూరు చంద్రశేఖర్, కార్యదర్శి సీహెచ్ వెంకటేశ్వరరావు, వైఎస్ కనకారావు, సురే భాస్కరరావు, నాయుడు వెంకటేశ్వరరావు, కూటమి నాయకులు అంబటి రజనీ కుమార్, లక్కింశెట్టి కిరణ్, సెట్టగోపం సత్యనారాయణ, బంగారు రాజు, సీహెచ్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళి :

భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని 23వ డివిజన్‌ వంగాయగూడెం సెంటర్‌లో ఉన్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి), మేయర్‌ రెడ్డి అప్పలనాయుడు గురువారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.