The Desk … Eluru : క్రైస్తవ వేడుకల్లో.. అయ్యప్ప సేవలో ఎమ్మెల్యే చంటి

The Desk … Eluru : క్రైస్తవ వేడుకల్లో.. అయ్యప్ప సేవలో ఎమ్మెల్యే చంటి

🟡 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ న్యూస్ :

మతసామరస్యానికి ప్రతీకగా ఎమ్మెల్యే పర్యటన

ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా వర్ధిల్లాలని ఏలూరు ఎమ్మెల్యే, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బడేటి చంటి ఆకాంక్షించారు. ఏలూరులోని సీఎస్ఐ చర్చి కాంపౌండ్‌లో ఏలూరు సిటీ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్యామిలీ క్రిస్మస్ వేడుకల్లో, శాంతినగర్‌లోని శ్రీ లక్ష్మీ నరసింహా మోటార్స్ రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రాంగణంలో నారా కుటుంబం ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొన్నారు. క్రిస్మస్ వేడుకల్లో పలువురు బిషప్‌లు, పాస్టర్లు పాల్గొనగా, అయ్యప్ప పూజల్లో ఏకాదశ రుద్రాభిషేకం, పంచామృతాభిషేకం, పల్లకీ సేవ, భజనలు నిర్వహించారు.

ఈ సందర్భంగా బడేటి చంటి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి ప్రార్థనలు చేశారు. రెండు కార్యక్రమాలు మతసామరస్యం, ఆధ్యాత్మిక భక్తిభావాన్ని చాటుతూ సందడిగా సాగాయి.