The Desk … Nandigama : మున్నలూరులో శైలజకు కూటమి మద్దతు

The Desk … Nandigama : మున్నలూరులో శైలజకు కూటమి మద్దతు

🟡 ఎన్టీఆర్ జిల్లా : నందిగామ : ది డెస్క్ :

మున్నలూరులో కూటమి జెండా ఎగరాలి

భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే సౌమ్య పిలుపు

కంచికచర్ల మండలం మున్నలూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కూటమి బలపరిచిన కొండపనేని నాగేశ్వరరావు సతీమణి కొండపనేని శైలజకు సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలిపారు.

గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామస్థులు తమ అమూల్యమైన ఓటును శైలజకు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కూటమి అభ్యర్థి విజయానికి ప్రతి ఒక్కరూ ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.