The Desk … Eluru : 27 జడ్పీటీసీ స్థానాలు కూటమివే

The Desk … Eluru : 27 జడ్పీటీసీ స్థానాలు కూటమివే

🟡 ఏలూరు జిల్లా : ఏలూరు/వట్లూరు : ది డెస్క్ న్యూస్ :

అభివృద్ధే మా విజయ మంత్రం

మున్సిపల్ ఫలితాలే పునరావృతం

ప్రజా తీర్పు కూటమికే అనుకూలం

జిల్లాలో క్లీన్‌స్వీప్‌ చేస్తాం

➖ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ధీమా

జిల్లాలో జరుగుతున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధిస్తుందని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. వట్లూరులోని జడ్పీ పాఠశాల పోలింగ్ కేంద్రంలో గురువారం ఇతర ఓటర్లతో కలిసి క్యూలో నిలబడి ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే ఒక జడ్పీటీసీ స్థానం టీడీపీకి ఏకగ్రీవం కాగా, మిగిలిన 26 స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులే విజయం సాధిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

గత మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలే పునరావృతమవుతాయన్నారు. వైసీపీ గత పాలనలో జరిగిన దౌర్జన్యాలపై ప్రజలు తిరగబడుతున్నారని, చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమమే విజయానికి పునాదులని పేర్కొన్నారు. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహిస్తున్న అధికారులను అభినందించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.