🟡 ఏలూరు జిల్లా : ఏలూరు/జంగారెడ్డిగూడెం : ది డెస్క్ :
విజేతలకు పుట్టా మహేష్ కుమార్ అభినందనలు
ప్రజా తీర్పే అభివృద్ధికి పునాది
కూటమి గెలుపు.. అభివృద్ధికి మలుపు
జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ ఎన్నికల్లో కూటమి సాధించిన విజయంపై ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం కౌంటింగ్ ముగిసిన అనంతరం జంగారెడ్డిగూడెం చేరుకున్న ఆయన.. చైర్పర్సన్ అభ్యర్థి రొంగల అనూషతో పాటు విజయం సాధించిన వార్డు కౌన్సిలర్లను కలిసి అభినందనలు తెలిపారు. కూటమిపై ప్రజలు ఉంచిన నమ్మకానికి ఈ విజయం నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పట్టణ అభివృద్ధికి విజేతలంతా అంకితభావంతో కృషి చేయాలని ఆకాంక్షించారు.

