The Desk … Bhimavaram : మావుళ్లమ్మకు బంగారు కానుక

The Desk … Bhimavaram : మావుళ్లమ్మకు బంగారు కానుక

🔴 పశ్చిమ గోదావరి జిల్లా : భీమవరం : ది డెస్క్ :

స్వర్ణ వస్త్రం ప్రాజెక్టుకు 6.400 గ్రాముల బంగారం విరాళం

భీమవరం పట్టణ ప్రజల ఇలవేల్పు, ఆరాధ్యదైవమైన మావుళ్లమ్మవారి దేవస్థానం చేపట్టిన సంపూర్ణ స్వర్ణ వస్త్రం ప్రాజెక్టుకు భక్తుల నుంచి విరాళాలు కొనసాగుతున్నాయి.

ఇందులో భాగంగా మంగళగిరికి చెందిన భోగి అంజియ్య–తిరుపతమ్మ దంపతులు 6 గ్రాముల 400 మిల్లీగ్రాముల బంగారాన్ని విరాళంగా అందజేశారు.

అమ్మవారి స్వర్ణ వస్త్రం ప్రాజెక్టుకు బంగారం అందజేసిన దంపతులకు ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, శేషవస్త్రం ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, అతికెల ఆంజనేయ ప్రసాద్, మిర్తిపాటి గున్నేశ్వరరావు, ఇందుకూరి సుబ్రమణ్యం రాజు తదితరులు దంపతులకు జ్ఞాపిక, ప్రసాదాన్ని అందజేశారు.

అమ్మవారి సంపూర్ణ స్వర్ణ వస్త్రం ప్రాజెక్టుకు భక్తులు తమవంతుగా బంగారం, విరాళాలు అందజేసి భాగస్వాములు కావాలని ఆలయ అధికారులు కోరారు. భక్తుల సహకారంతో స్వర్ణ వస్త్రం ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేయడానికి చర్యలు కొనసాగుతున్నాయని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు.