🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :
09,10 సెప్టెంబర్, అల్లూరి సీతారామరాజు స్టేడియంలో
ఏలూరు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 9నుండి 10వరకు జిల్లా సెలక్షన్స్ అల్లూరి సీతారామరాజు స్టేడియంలో , కర్నూలు జిల్లా ఆదోని (ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్)లో అక్టోబర్ 2 నుండి 4 జరగబోయే రాష్ట్రస్థాయి జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్2026 పోటీలలో ఏలూరు జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించే జట్లను ఎంపిక చేయడానికి జిల్లా స్థాయి ఎంపిక పోటీలు నిర్వహించబడుతున్నాయి. ఈ విషయమై అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ గుళ్ళ ప్రసాదరావు, కార్యదర్శి శ్రీ దేవరపల్లి ప్రసాద్ ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు.
పోటీల వివరాలు :
👉🏼 తేదీలు : సెప్టెంబర్ 9 మరియు 10, 2026 (బుధవారం & గురువారం)
👉🏼 సమయం: ఉదయం 8:00 గంటల నుండి
👉🏼 వేదిక: అల్లూరి సీతారామరాజు స్టేడియం, ఏలూరు
👉🏼 అర్హత: ఏలూరు జిల్లా వాసులకు మాత్రమే (బాలబాలికలు)
👉🏼 రిజిస్ట్రేషన్ ఫీజు: ₹200/-
వయోపరిమితి మరియు కట్-ఆఫ్ తేదీలు (Age Brackets) :
▪️అండర్ -14 (U-14 Years): 28.10.2012 నుండి 27.10.2014 మధ్య జన్మించి ఉండాలి.
▪️అండర్ -16 (U-16 Years): 28.10.2010 నుండి 27.10.2012 మధ్య జన్మించి ఉండాలి.
▪️అండర్ -18 (U-18 Years): 28.10.2008 నుండి 27.10.2010 మధ్య జన్మించి ఉండాలి.
▪️ అండర్ -20 (U-20 Years): 28.10.2006 నుండి 27.10.2008 మధ్య జన్మించి ఉండాలి.
(గమనిక: అండర్-10 -09-09-2019 నుండి09-09-2017
అండర్-12 ,-10-09-2017 నుండి 09-09-2015 విభాగాలకు కూడా ఎంపికలు ఉంటాయి) అండర్ 10 boys and girls
అండర్ 12 boys and girls
ఈ రెండు కేటగిరీల వాళ్లకి డిస్టిక్ లెవెల్ వరకే మాత్రమే
హాజరుకావలసిన పత్రాలు (తప్పనిసరి) :
▪️ఆధార్ కార్డ్
▪️పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం (Birth Certificate)
▪️SSC (10వ తరగతి) మార్కుల జాబితా /వయస్సు నిర్ధారణ సర్టిఫికేట్
ఈ ఎంపిక పోటీలలో క్వాలిఫైయింగ్ ప్రమాణాలు సాధించి విజేతులుగా నిలిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు పంపడం జరుగుతుంది.
(అండర్ 16 బాయ్స్ అండ్ గర్ల్స్ కి 2km రన్ కి క్యాష్ 5000/- అవార్డు ఉంటది/-స్పాన్సర్ చేసిన వాళ్లు ఏలూరు జిల్లా అధ్యక్షులు జి. ప్రసాదరావు.
సంప్రదించవలసిన ఫోన్ నెంబరు: 6281431202

