🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ :
స్వర్ణ వస్త్రం ప్రాజెక్ట్‌కు 1- 1/4 పావు (కాసు + పావు) బంగారం విరాళం
స్వర్ణ వస్త్ర ప్రాజెక్ట్‌కు దంపతుల బంగారు కానుక
భీమవరం మావుళ్లమ్మవారి సంపూర్ణ స్వర్ణ వస్త్రం ప్రాజెక్ట్‌కు భక్తులు విశేషంగా విరాళాలు అందజేస్తున్నారు. ఇందులో భాగంగా భీమవరానికి చెందిన దాట్ల హేమంత్ వర్మ–శ్రీమతి తన్వి దంపతులు 10 గ్రాముల బంగారాన్ని విరాళంగా అందజేశారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు దంపతులకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, పాపోలు ఏడుకొండలు, స్వర్ణ వస్త్రం ప్రాజెక్ట్ సభ్యులు గోంట్ల నారాయణరావు దంపతులను అభినందించారు. విరాళదాతలకు ప్రసాదంతో పాటు జ్ఞాపికను అందజేశారు.
మావుళ్లమ్మ సంపూర్ణ స్వర్ణ వస్త్రం ప్రాజెక్ట్‌లో భక్తులు భాగస్వాములు కావడం అభినందనీయమని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు.
Datla Couple Donates Gold to Mavullamma Swarna Vasthram Project
Devotees continue to extend generous support to the Swarna Vasthram Project being undertaken for Sri Mavullamma Ammavaru
Temple in Bhimavaram, with a Datla couple making a significant gold donation towards the initiative.
Bhimavaram-based Datla Hemanth Varma and Smt. Tanvi donated 10 grams of gold to the project aimed at adorning the presiding deity, Sri Mavullamma Ammavaru, with a complete gold garment.
Temple priests performed special rituals for the donors and offered them blessings.
Temple Chairman Bondada Nagabhushanam, trustees Ramayanam Srinivas and Papolu Yedukondalu, and Swarna Vasthram Project members Gontla Narayana Rao and others congratulated the couple for their contribution.
The temple authorities presented the donors with prasadam and a memento on the occasion.
Temple Assistant Commissioner Buddha Mahalakshmi Nagesh said that the participation of devotees in the Sri Mavullamma Swarna Vasthram Project was highly appreciable. She appealed to more devotees to come forward and contribute to the sacred initiative.
The temple authorities expressed their gratitude to the Datla couple for their devotional contribution and support to the project.

