The Desk … Eluru : తల్లి–బిడ్డల భద్రతకు ‘102’ భరోసా

The Desk … Eluru : తల్లి–బిడ్డల భద్రతకు ‘102’ భరోసా

🟡 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

నూతన తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనం ప్రారంభం

తల్లులు, నవజాత శిశువుల ఆరోగ్య భద్రతకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఏలూరు ఎమ్మెల్యే, జిల్లా టీడీపీ అధ్యక్షుడు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) అన్నారు. తల్లులు, శిశువులకు మెరుగైన, సురక్షితమైన రవాణా సౌకర్యం కల్పించేందుకు ఏర్పాటు చేసిన 102 తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్‌ నూతన వాహనాన్ని ఆయన ప్రారంభించారు.

సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ :

ప్రసవానంతరం బాలింతలు, నవజాత శిశువులు వైద్య సేవలు పూర్తిచేసుకుని సురక్షితంగా ఇళ్లకు చేరేందుకు 102 సేవలు ఎంతో దోహదపడతాయన్నారు. తల్లి, బిడ్డ ఆరోగ్య సంరక్షణలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్యామలాదేవి, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ కమలా, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ శోభ, అసిస్టెంట్‌ కలెక్టర్‌ శ్రవణ్‌కుమార్‌, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్‌ బేబీ కమలతో పాటు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.