The Desk … Nandigama : రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే తంగిరాల

The Desk … Nandigama : రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే తంగిరాల

🟡 ఎన్టీఆర్ జిల్లా : నందిగామ : ది డెస్క్ :

సొంత నిధులతో సప్లై ఛానల్ పూడికతీత పనులకు శ్రీకారం

రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలిపారు. నందిగామ పట్టణ పరిధిలోని అనాసాగరం–శనగపాడు సప్లై ఛానల్‌లో పూడికతీత పనులను సోమవారం ఆమె సొంత నిధులతో ప్రారంభించారు. కాలువలో పేరుకుపోయిన పూడిక, చెత్తాచెదారాన్ని తొలగించి సాగునీటి ప్రవాహానికి ఆటంకాలు లేకుండా చర్యలు చేపట్టారు.

రైతులకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా కాలువల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు సౌమ్య తెలిపారు. ప్రభుత్వ నిధుల కోసం ఎదురుచూడకుండా అవసరమైన చోట సొంత నిధులతో సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్న నమ్మకంతో పనిచేస్తున్నామని, నందిగామ నియోజకవర్గంలో సాగునీటి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.