🟡 ఢిల్లీ/ఏలూరు : ది డెస్క్ :
వైద్య విద్యలో AI..
డిజిటల్ దిశగా కేంద్రం అడుగులు
ఆంధ్రప్రదేశ్‌లో వైద్య విద్యాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గత ఐదేళ్లలో రూ.590.02 కోట్ల నిధులు విడుదల చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌కుమార్ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు శుక్రవారం ఆమె సమాధానమిచ్చారు.
2021–26 మధ్య కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు రూ.342.36 కోట్లు, పీజీ వైద్య సీట్ల పెంపునకు రూ.247.66 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి వివరించారు. దేశవ్యాప్తంగా 2014 నుంచి వైద్య కళాశాలల సంఖ్య 387 నుంచి 846కు, యూజీ సీట్లు 51,348 నుంచి 1,39,489కు, పీజీ సీట్లు 31,185 నుంచి 86,360కు పెరిగినట్లు వెల్లడించారు.
వైద్య విద్యలో సాంకేతికత, కృత్రిమ మేధస్సు (AI) వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. NMC ఆధ్వర్యంలో CBME-2024 ద్వారా ఆధునిక వైద్య విద్యా విధానాలను అమలు చేస్తున్నామని, పీజీ విద్యార్థుల కోసం డిజిటల్ లాగ్‌బుక్‌లు, ఈ-లెర్నింగ్, డిజిటల్ డాక్యుమెంటేషన్‌ను ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు. వైద్య రంగ నిపుణుల కోసం AIపై ఆన్లైన్ శిక్షణ కార్యక్రమాన్ని NBEMS ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు.

