🔴 పశ్చిమ గోదావరి జిల్లా : భీమవరం : ది డెస్క్ :
సురేష్ – సువర్ణ దంపతులకు ఆలయ అధికారులు ప్రత్యెక పూజలు
భీమవరంలోని ప్రసిద్ధ మావుళ్లమ్మవారి ఆలయంలో చేపట్టిన ‘సంపూర్ణ స్వర్ణవస్త్రం’ ప్రాజెక్టుకు విశాఖపట్నానికి చెందిన వేగేశ్న సురేష్కుమార్ వర్మ–సువర్ణ తేజశ్వి దంపతులు 10 గ్రాముల బంగారాన్ని విరాళంగా అందజేశారు.
అమ్మవారి సేవలో భాగంగా భక్తిశ్రద్ధలతో బంగారాన్ని ఆలయానికి సమర్పించిన దంపతులకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ మాట్లాడుతూ…
మావుళ్లమ్మవారి సంపూర్ణ స్వర్ణవస్త్రం ప్రాజెక్టుకు భక్తులు అందిస్తున్న విరాళాలు అభినందనీయమన్నారు. భక్తుల సహకారంతో ప్రాజెక్టు విజయవంతంగా ముందుకు సాగుతుందని తెలిపారు.
అమ్మవారి సేవలో భాగస్వాములైన దంపతులను ఆలయ అధికారులు అభినందించారు.

