🟡 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

ఏలూరు నగరంలోని శ్రీ పొట్టి శ్రీరాములు రైతు బజార్‌లో జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన తగ్గింపు ధరల బియ్యం విక్రయ కేంద్రాన్ని ఎమ్మెల్యే బడేటి చంటి సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ :
ధరల పెరుగుదలతో పేద కుటుంబాలపై భారం తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతోందని, రైస్ మిల్లర్స్ అసోసియేషన్, సివిల్ సప్లైస్ శాఖ సమన్వయంతో స్టీమ్ బియ్యం కిలో రూ.52, రా బియ్యం రూ.50కు రేషన్ లేదా ఆధార్ కార్డు ఆధారంగా అందుబాటులో ఉంచడం అభినందనీయమన్నారు.
ఈ అవకాశాన్ని అర్హులైన ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం రైతు బజార్‌లో రైతులు, వ్యాపారులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుని భరోసా కల్పించారు.

