The Desk … Nandigama : ఎంపీ కేశినేని జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే సౌమ్య.. కూటమి నేతలతో కలిసి కేక్ కటింగ్

The Desk … Nandigama : ఎంపీ కేశినేని జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే సౌమ్య.. కూటమి నేతలతో కలిసి కేక్ కటింగ్

🟡 ఎన్టీఆర్ జిల్లా | నందిగామ నియోజకవర్గం | ది డెస్క్ :

CBN నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తోంది
➖ తంగిరాల సౌమ్య (ఎమ్మెల్యే)

విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) జన్మదిన వేడుకలు నందిగామ నియోజకవర్గంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కూటమి నేతలు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి ఎంపీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ :

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. ప్రజాప్రతినిధుల సమన్వయంతో విజయవాడ పార్లమెంట్ పరిధి అభివృద్ధికి ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఎంపీ ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరింత ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు.