🟡 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్

అధునాతన అంబులెన్స్ ప్రజలకు అంకితం
ఫ్రెండ్షిప్ డే సందర్భంగా సేవా కార్యక్రమం
ప్రముఖుల ప్రశంసలు
ఆపత్కాలంలో బాధితులకు సకాలంలో వైద్యసేవలు అందించేందుకు ఫ్లాష్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వెంటిలేటర్, అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్, మొబైల్ ఐసీయూ సదుపాయాలతో కూడిన అధునాతన అంబులెన్స్‌ను ఆదివారం ఏలూరు ఇండోర్ స్టేడియంలో ప్రజలకు అంకితం చేశారు. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా నిర్వహించిన ‘స్మరణోత్సవం–2026’ కార్యక్రమంలో ఎమ్మెల్యే బడేటి చంటి, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ :
సేవా కార్యక్రమాల్లో ఫ్లాష్ సంస్థ ఎప్పుడూ ముందుంటుందని, ప్రజలకు ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమాలకు తన సహకారం కొనసాగుతుందని తెలిపారు. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్, ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ మాట్లాడుతూ, ఆపదలో ఉన్నవారి ప్రాణాలు కాపాడే లక్ష్యంతో అధునాతన అంబులెన్స్‌ను అందుబాటులోకి తేవడం అభినందనీయమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో సేవాభావులు, దాతలు, ఫ్లాష్ ప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.

A state-of-the-art Advanced Life Support (ALS) ambulance equipped with a ventilator and mobile Intensive Care Unit (ICU) facilities was dedicated to the public by the voluntary organisation Flash at the Indoor Stadium in Eluru on Sunday, with the objective of ensuring timely emergency medical care for critically ill and accident victims.
The ambulance was inaugurated during Smaranotsavam–2026, a programme organised to mark Friendship Day. The event was attended by Eluru MLA Badeti Chanti, former MP Lagadapati Rajagopal, Achanta MLA Pitani Satyanarayana, and other public representatives.
Speaking on the occasion, Badeti Chanti commended Flash for its continued commitment to humanitarian service and said initiatives that directly benefit the public deserve encouragement and support. He assured the organisation of his continued cooperation in its service-oriented activities.
Lagadapati Rajagopal and Pitani Satyanarayana appreciated the initiative, stating that the introduction of a fully equipped emergency ambulance would significantly strengthen pre-hospital care and improve the chances of saving lives during medical emergencies.
Several philanthropists, donors, members of Flash, political leaders and invited guests participated in the programme.

