🟡 ఎన్టీఆర్ జిల్లా : నందిగామ : ది డెస్క్ :
అనాసాగరంలో ఇంటింటికీ ‘రెండేళ్ల నమ్మకం’ కరపత్రాల పంపిణీ
అభివృద్ధి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వమే చిరునామా అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. పట్టణంలోని 1వ వార్డు అనాసాగరంలో శుక్రవారం కూటమి నాయకులతో కలిసి ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల వివరాలతో కూడిన కరపత్రాలను ఇంటింటికీ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ :
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమంతో పాటు మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ప్రభుత్వ పథకాల ఫలాలు ప్రతి కుటుంబానికి చేరేలా ఈ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కూటమి నేతలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Coalition Government Committed to Development and Welfare
➖MLA Sowmya
Andhra Pradesh Government Whip and Nandigama MLA Tangirala Sowmya on Friday said the coalition government remains firmly committed to ensuring inclusive development and people-centric welfare across the State.
As part of the government’s public outreach campaign marking two years in office, the MLA, accompanied by coalition leaders, visited Anasagaram in Ward No. 1 of Nandigama town and distributed informational pamphlets highlighting the government’s key welfare initiatives and development achievements.
Addressing residents during the programme, Ms. Soumya said the State, under the leadership of Chief Minister N. Chandrababu Naidu, is progressing steadily on the path of sustainable development. She noted that the government is giving equal priority to strengthening public infrastructure and implementing welfare programmes aimed at improving the quality of life of citizens.
She said the door-to-door awareness campaign has been launched to ensure that every household is informed about the benefits of various government schemes and the developmental initiatives undertaken over the past two years.
Coalition leaders, elected representatives and party workers participated in the outreach programme.

