The Desk … Bhimavaram : మావుళ్లమ్మ స్వర్ణ వస్త్ర ప్రాజెక్టుకు రూ.2.01 లక్షల విరాళం

The Desk … Bhimavaram : మావుళ్లమ్మ స్వర్ణ వస్త్ర ప్రాజెక్టుకు రూ.2.01 లక్షల విరాళం

🔴 ప.గో జిల్లా : భీమవరం : ది డెస్క్ :

దాతలను అభినందించిన ఆలయాధికారులు

భీమవరంలోని మావుళ్లమ్మ సంపూర్ణ స్వర్ణ వస్త్ర ప్రాజెక్టుకు చినఅమిరానికి గ్రామానికి చెందిన గొట్టుముక్కల వెంకట రమేష్ రాజు, వెంకట లక్ష్మి పద్మావతి దంపతులు రూ.2,01,116 విరాళాన్ని అందజేశారు. స్థానిక ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు వారి చేతుల మీదుగా విరాళాన్ని ఆలయ అధికారులకు అందించారు.

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి దాతలను ఆశీర్వదించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం, జ్ఞాపికను అందజేసి సత్కరించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, గుసిడి నాగ శిరీష, పాపోలు ఏడుకొండలు, స్వర్ణ వస్త్ర ప్రాజెక్టు కమిటీ సభ్యులు గొంట్ల నారాయణ ప్రసాదం తదితరులు పాల్గొన్నారు.